గుంటూరు వెస్ట్: ఈ ఏడాది టెన్త్, ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ ‘షైనింగ్ స్టార్స్ – 2026’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు విద్యా శాఖ అధికారులతో ఆదివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు పొన్నూరు రోడ్డులోని బీ కన్వెన్షన్‌లో కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. 10వ తరగతిలో 137, ఇంటర్‌కు 40 మందిని సన్మానించనున్నారు.
ఏర్పాట్లు పూర్తి
షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా తెలిపారు. ఆదివారం పొన్నూరు రోడ్డులోని బీ కన్వెన్షన్‌లో కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. చక్కగా ఏర్పాట్లు చేశారని ఎంఈవోలు, ఇతర అధికారులు, పలువురు ప్రధానోపాధ్యాయులను ఆయన అభినందించారు.


