గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా ప్రొటోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్‌ను గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నారదాసు వీర మణింద్ర, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీహెచ్ రమేష్‌లు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్‌ను కలిసి గుంటూరు జిల్లా కోర్టులో నూతన భవనం ఏర్పాటు గురించి చర్చించటం జరిగిందని బార్ అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు.
‘ఎన్టీఆర్’ డీఎంహెచ్‌ఓగా డాక్టర్ శ్రావణ్‌బాబు
గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబును ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్‌ఓగా నియమిస్తూ సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డెప్యూటీ సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్న ఆయనకు సివిల్ సర్జన్‌గా పదోన్నతి ఇచ్చి డీఎంహెచ్‌ఓగా పోస్టింగ్ ఇచ్చారు. గుంటూరు జల్లా రేపల్లె సమీపంలోని బెల్లంవారిపాలెంకు చెందిన డాక్టర్ శ్రావణ్‌బాబు గుంటూరు వైద్య కళాశాలలో 1988లో ఎంబీబీఎస్, విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కళాశాలలో 2011లో పీజీ డీసీహెచ్ చేశారు. గుంటూరు జిల్లా అప్పికట్లలో 1998లో మెడికల్ ఆఫీసర్‌గా విధుల్లో చేరి ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించారు. బాపట్ల పీపీ యూనిట్‌లో, పొన్నూరు, పొదిలిలలో పలు హోదాల్లో పనిచేశారు. చీరాల ఏరియా ఆసుపత్రిలో పిల్లల వైద్యనిపుణులుగా పనిచేశారు. డాక్టర్ శ్రావణ్‌బాబు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (ఎన్‌సీడీ) జిల్లా ప్రొగ్రాం ఆఫీసర్‌గా, ఆర్‌బీఎస్‌కే జిల్లా కోర్డినేటర్‌గా గతంలో విధులు నిర్వహించారు. డాక్టర్ శ్రావణ్‌బాబుకు గుంటూరు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, పలువురు వైద్యాధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, డీఎంహెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.


