తప్పుడు కేసులతో యువతరాన్ని భయపెట్టలేరు వైఎస్సార్ సీపీలో యాక్టివ్‌గా ఉంటున్న యువజన నాయకులపై కేసులు వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉత్తేజ్ రెడ్డి
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రజా సమస్యలపై గళం వినిపిస్తున్న వైఎస్సార్ సీపీ యువజన విభాగ నాయకులపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు ఉత్తేజ్ రెడ్డి అన్నారు. శనివారం బృందావన్‌గార్డెన్స్‌లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఉత్తేజ్‌రెడ్డి మాట్లాడుతూ రెండేళ్లు పూర్తి చేసుకున్న కూటమి పాలనలో ఇచ్చిన హామీలు అమలు కాని పరిస్థితులపై వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజలకు వాస్తవాలను వివరించామని చెప్పారు. నిరసన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో భయపెడుతోందని, తాము అక్రమ కేసులు, అరెస్టులకు భయపడబోమని స్పష్టం చేశారు. ఎంత నిర్బంధించాలని చూసినా, ఎదురిస్తామని, టీడీపీ అక్రమాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని అన్నారు. పోలీసులు వైఎస్సార్ సీపీకి ఒక రూల్, కూటమి నేతలకు ఒక రూల్ అమలు చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ తరపున ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తుంటే అక్రమ కేసులు మోపుతున్న పోలీసులు టీడీపీ నేతలు ఎంత పెద్ద తప్పు చేసినా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతున్నారని ఆరోపించారు. యువజన విభాగ నగర అధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యనిర్వహక అధ్యక్షుడు కారుమూరి సునీల్ యాదవ్‌ను అక్రమ కేసులో అరెస్టు చేయించారని ఆరోపించారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ బీసీలను అణగదొక్కుతోందన్నారు. పార్టీ వెస్ట్ యువజన విభాగ అధ్యక్షుడు కానూరి శశిధర్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీలో యువ నాయకుడిగా ఎదుగుతున్న కారుమూరి సునీల్ యాదవ్‌ను చంద్రబాబు అక్రమ అరెస్టు చేయించారని ఆరోపించారు. యువతను అణగదొక్కేందుకు, వైఎస్సార్ సీపీ కోసం పనిచేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయడం, తప్పుడు కేసులో అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. సునీల్ కుమార్‌కు అండగా ఉంటామని, వైఎస్ జగన్ వచ్చాక అందరికీ శిక్షలు పడతాయని అన్నారు. నగర ఉపాధ్యక్షుడు వై.వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో లిక్కర్ స్కామ్ వెలుగు చూసిందని, పర్మిట్ రూమ్స్‌కు అనుమతులు ఎవరిచ్చారని అన్నారు. అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నారని అన్నారు. సమావేశంలోతూర్పు విభాగ అధ్యక్షుడు షేక్ సుభానీ కొండా కోటిరెడ్డి(ప్రత్తిపాడు), వెంకటరెడ్డి (తాడికొండ) పాల్గొన్నారు.


