జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా బాధ్యతల స్వీకరణ

Jun 20 2026 5:52 AM | Updated on Jun 20 2026 5:52 AM

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా బాధ్యతల స్వీకరణ

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ గిరిజవోలు దుర్గాప్రసాద్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌, డాక్టర్‌ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారి నుంచి డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ బాధ్యతలు తీసుకున్నారు. మే 31న డాక్టర్‌ యశస్వి రమణ పదవీ విరమణ చేయడంతో ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌ (ఎఫ్‌ఏసీ) సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారిని డీఎంఏ నియమించారు. రెండు వారాలు గడవకముందే డాక్టర్‌ గిరిజవోలు దుర్గాప్రసాద్‌కు ఎఫ్‌ఏసీ సూపరింటెండెంట్‌గా డీఎంఈ ఉత్తర్వులు ఇవ్వడంతో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ నర్సింగ్‌ సిబ్బంది, కింది స్థాయి ఉద్యోగుల కొరత అధిగమిస్తామని పేర్కొన్నారు. ఓపీ సేవలకు ప్రత్యేక యాప్‌ తెస్తామన్నారు. ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. దుర్గాప్రసాద్‌ను అడ్మినిస్ట్రేటర్‌ చిన్నం సుధారాణి, అసిస్టెంట్‌ డైర్టెర్‌ పూసల శ్రీనివాసరావు, పరిపాలనా అధికారి గోపవరపు స్టాన్లీరాజ్‌కుమార్‌, సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ బి.వి.రావు అభినందించారు.

జిల్లా కలెక్టర్‌తో భేటీ

గుంటూరు వెస్ట్‌: డాక్టర్‌ జి.దుర్గాప్రసాద్‌ శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement