న్యూస్‌రీల్
పర్యవేక్షణ లేని సివిల్ సప్లయీస్ శాఖ..
ఇంకా అందుబాటులోకి రాని డీజిల్ బంక్‌ల వద్ద కొనసాగుతున్న బారులు రోడ్డెక్కిన అధికారులు.. బంక్‌లలో తనిఖీలు డీజిల్ దొరకక నిలిచిపోతున్న ఆటోలు పనులు నిలిచిపోయి అన్నదాతల ఆందోళన ఇదే పరిస్థితి కొనసాగితే నిలిచిపోనున్న సరకు రవాణా
క్షేత్రస్థాయికి అధికార యంత్రాంగం ..
ఇంధనం కోసం ఆందోళన వద్దు
మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు.
అంకమ్మతల్లికి పూజలు
దాచేపల్లి:స్థానిక వీర్ల అంకమ్మతల్లి కొలుపు ల తిరునాళ్ల సందర్భంగా సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు.
నిమ్మకాయల ధరలు
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,500, గరిష్ట ధర రూ.10,000, మోడల్ ధర రూ.7,000 వరకు పలికింది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లా ప్రజలకు డీజిల్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆగ్రహం అంటూ పచ్చమీడియాలో పబ్లిసిటీ చేసుకున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మెరుగుపడలేదు. జిల్లాలో మొత్తం పెట్రోల్ బంకులు 195 ఉండగా, అందులో సగానికి పైగా మూతపడ్డాయి. ప్రతిరోజు 450 నుంచి 500 కేఎల్ (కిలో లీటర్స్) వాడకం ఉంటుందని, కొరత ఏర్పడటంతో 700 కిలోలీటర్ల వరకు వాడకం ఉందని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఆటోలు, కార్లు డీజిల్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. డీజిల్ లేక టాక్సీలు బయటకు రాలేదు. ఆటోలు కూడా చాలా వరకూ ఇళ్లకే పరిమితం అయ్యాయి. అనేక పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. దీంతో వాహన యజమానులు, రైతులు గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా రేషన్ తరహాలో పరిమితంగా డీజిల్ విక్రయిస్తున్నారు.అన్నదాతలు డీజిల్ కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్న తరలింపుకు, పంట కోత యంత్రాలకు, మోటార్లకు ఎక్కువ మొత్తంలో డీజిల్ కావాల్సి ఉండటంతో ప్లాస్టిక్ టిన్నులతో పెట్రోల్ బంక్‌ల వద్ద రైతులు క్యూ కట్టిన పరిస్థితి చాలాచోట్ల కనపడింది. కోల్డ్ స్టోరేజ్, రవాణా వ్యవస్థలు దెబ్బతినడం వల్ల ఉత్పత్తి నష్టాలు పెరుగుతున్నాయి. లారీలు, ట్రాక్టర్లు నడపటం ఇబ్బందిగా మారటంతో సరుకు రవాణా మందగించింది. రాష్ట్ర స్థాయిలో నిల్వలు ఉన్నప్పటికీ, సరఫరా వ్యవస్థలో లోపాల కారణంగా డీజిల్ అందుబాటులో లేకుండా పోయిందని పెట్రోల్ బంక్‌ల అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. కొన్ని చోట్ల ప్రజల అవసరాలను అడ్డం పెట్టుకుని డీజిల్ బ్లాక్ మార్కెట్‌కు తరలించారు.
మొన్నటివరకు గ్యాస్ కొరత వేధిస్తే, తాజాగా మూడు రోజుల నుంచి ఇంధన కొత్త ఏర్పడింది. సివిల్ సప్లయీస్ డీఎస్‌ఓ కోమలి పద్మ గత పది రోజుల నుంచి సెలవుపై విదేశాలకు వెళ్లారు. డీఎస్‌ఓ అందుబాటులో లేకపోవడంతో ఆ శాఖలో పర్యవేక్షణ లేకుండా పోయింది. మరోవైపు నగరంలో డీజిల్ కొరత నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా పలు బంకులను సందర్శించి అక్కడ వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
నృసింహుని గరుడ సేవ
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణ పరిధిలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఆలయ ముఖ మండపంపై నరసింహస్వామి వారికి అర్చకులు ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, నారసింహ మూల మన్య హోమం నిర్వహించారు. సాయంత్రం అగ్ని ప్రణయనం, కుమ్భారాధన, నారసింహ హోమం అనంతరం స్వామి వారికి గరుడ సేవ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వైభవంగా శ్రీ వాసవీ అమ్మవారి గ్రామోత్సవం
రెంటచింతల: ఆర్యవైశ్యుల ఇలవేల్పు, జగజ్జనని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలలో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహంతో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి భక్తులు పెద్దసంఖ్యలో గ్రామ పురవీధులలో భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన నిర్వహించారు. గ్రామోత్సవంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీవెనలు పొందారు. సోమిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో భక్తులు కోలాటం ప్రదర్శించారు. దేవస్థానం చైర్మన్ నాళం చినబాబు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
చెన్నకేశవ స్వామిని తాకిన సూర్య కిరణాలు
వేమూరు: జంపని గ్రామంలో వేంచేసి ఉన్న భూసహిత చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో సోమవారం ఉదయం మూలవిరాట్ స్వరూపం చెన్నకేశవుడిని సూర్యకిరణాలు తాకాయి. పాదాల నుంచి కీరీటం వరకు స్వామి వారిని 40 నిమిషాలకు పైగా సూర్య భగవానుడు స్పృశించాడు. ఈ సుందరమైన అనుభూతిని కలిగించే దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయం చెందారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచూ స్వామి వారిపై సూర్య కిరణాలు పడుతుంటాయని అర్చకులు శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి సూర్య అష్టకం పంచసూక్తాలను పఠించి సూర్య నమస్కారాలు చేశారు.
రేపటి నుంచి చందోలు బగళాముఖి అమ్మ తిరునాళ్ల
చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన బగళాముఖి అమ్మవారి వార్షిక తిరునాళ్ల ఈనెల 29 నుంచి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కలకోట చక్రధర్‌రెడ్డి, ఈవో నరసింహమూర్తి తెలిపారు. తిరునాళ్లకు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా భక్తులు హాజరవుతారని తెలిపా రు. మే 2వ తేదీన బగళా ముఖి అమ్మవారికి ప్రాచీన కాలంనాటి బంగారు ఆభరణాలు అలంకరణ చేయటం జరుగుతుందని చెప్పారు. మే 3వ తేదీన పలు గ్రామాల నుంచి భక్తులు భారీ విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేసుకుని పసుపు బండ్లతో ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారన్నారు.
బంక్యూ
పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నాను. ప్రస్తుతం పొలాల్లో నుంచి మొక్కజొన్న పంట తరలింపు కార్యక్రమం ముమ్మురంగా జరుగుతోంది. అయిపోతుందని సమాచారం మేరకు రెండు రోజుల క్రితమే ట్రాక్టర్‌కు 20 లీటర్లు పోయించాను. ప్రస్తుతం అది అయిపోయే పరిస్థితి నెలకొంది. బంకుల్లో డీజిల్ లేదని చెబుతున్నారు. దీంతో మొక్కజొన్న రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు.
– కిరణ్‌రాజు,
మునిపల్లె, పొన్నూరు మండలం
గుంటూరు వెస్ట్: డీజిల్, పెట్రోల్ కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని, సమస్యలన్నీ సర్దుమణుగుతున్నాయని జిల్లా కలెక్టర్ సీఎం.సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో ఎస్పీ వకుల్‌జిందాల్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. మంగళవారం ఉదయం నాటికి అన్ని బంకులు పూర్తి స్థాయిలో పని చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి బంక్ వద్ద ఒక రెవెన్యూ ఉద్యోగి, ఒక పోలీసు కానిస్టేబుల్‌ను నియమించి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు.
– జిల్లా కలెక్టర్ సీఎం.సాయికాంత్ వర్మ
ఏఎన్‌యూ(పెదకాకాని): స్వర్ణోత్సవాల వేళ ఆయా కళాశాలల వార్షికోత్సవాలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ముస్తాబయింది. విశ్వవిద్యాలయంలో రెండు రోజులు పాటు నిర్వహించే వేడుకలకు ప్రొఫెసర్ త్రిమూర్తిరావు కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. గతంలో ఏ కళాశాలకు ఆ కళాశాల ప్రత్యేకంగా వార్షికోత్సవాలు నిర్వహించుకోగా ఈ ఏడాది స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకొంటున్న తరుణంలో ఐదు కళాశాలల్లో ఒకేసారి వార్షికోత్సవం జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సోమవారం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో కళాశాలల ప్రిన్సిపాల్స్, వేడుకల నిర్వహణ కమిటీ కన్వీనర్లు, మెంబర్స్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేసి, వార్షికోత్సవాల కార్యచరణపై చర్చించారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.వీరయ్య ,ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య తేజోమూర్తి, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కేవీ నిరుపమ, కమిటీ కన్వీనర్లు, సభ్యులు పాల్గొన్నారు.
7
జిల్లా అధికార యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగి అన్ని బంకులలో ఆయిల్ నిల్వలు తనిఖీలు చేశారు. జిల్లా కలెక్టర్ నుంచి తహసీల్దార్ వరకు, మరోవైపు పోలీసు యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది. అనేక బంకులను తనిఖీ చేశారు. రాజధాని ప్రాంతమైన మందడంలో అయిల్ లేదంటూ బంక్ మూసివేశారు. అయితే తుళ్లూరు తహసీల్దార్ తనిఖీలలో బంక్‌లో ఆయిల్ నిల్వలు ఉన్నట్లు గుర్తించడంతో మళ్లీ బంక్‌ను తెరిపించి అమ్మకాలు సాగించారు. కొన్ని బంకుల్లో ఇబ్బందులను గుర్తించామని, ఈ కొరత అంశం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత వాటిపై చర్యలకు ఉపక్రమిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. సోమవారం అర్ధరాత్రికి అన్ని బంక్‌లకు డీజిల్ అందుబాటులోకి వస్తుందని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.


