హత్యకు పథక రచన
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026 హత్యకు పథక రచన
తాడేపల్లి రూరల్: మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన నాగరాజు (45)ను ఈ నెల 18వ తేదీన భార్య, ప్రియుడు కలిసి హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ హత్య ఉదంతంలో విస్తుపోయే నిజాలు ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి...భర్త హత్యకు ఐదు నెలల ముందే భార్య తన పఽథకాన్ని అమలు చేసినట్టు తాజాగా తెలుస్తోంది. అంతేగాక ఆ రాత్రి భర్తను హత్యచేసిన అనంతరం భార్య లక్ష్మీ మాధురి ఫోర్న్‌వీడియోలు చూస్తూ గడిపినట్టు సమాచారం. భర్తను హత్య చేసేందుకు తన ప్రియుడితోపాటు ఆమెకు మరో వ్యక్తి కూడా సహకరించినట్టు తెలిసింది.
నాగరాజు హత్యకేసులో మరో వ్యక్తి ఆర్‌ఎంపీ డాక్టర్‌ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నాగరాజును ఐదు నెలల క్రితమే హత్యచేయాలని భార్య లక్ష్మీ మాధురి , ప్రియుడు గోపి పధకం పన్నినట్లు తెలియవచ్చింది. దీనిలో భాగంగా నాగరాజు తనను వేధిస్తున్నాడని లక్ష్మీ మాధురి తన కుటుంబ సభ్యులతో కలసి దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌లో ఆగస్టు 1వ తేదీన ఫిర్యాదు చేసింది. జరిగిన విషయాన్ని మొత్తం పోలీసుల ముందు నాగరాజు వివరించడంతో చివరకు లక్ష్మీ మాధురి ప్లేటు ఫిరాయించి ప్రియుడిని తమ్ముడిగా చెబుతూ నమ్మబలికింది. అవసరమైతే భర్తకు విడాకులు ఇచ్చి గోపీతో వెళ్లిపోతానని పోలీసుల ముందు తేల్చి చెప్పడంతో నాగరాజు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యి, నాగరాజుతో కాపురం చేయనవసరం లేదు, వెళ్లి పొమ్మని తేల్చిచెప్పారు. అయితే నాగరాజు తన 12 సంవత్సరాలు, 3 సంవత్సరాల కుమారులు తల్లిలేక ఇబ్బంది పడతారని రాజీ పడి లక్ష్మీ మాధురికి నచ్చజెప్పి ఇంటికి తెచ్చుకున్నాడు.
తనను భార్య హత్య చేయిస్తుందని అప్పటికే తన స్నేహితుల వద్ద నాగరాజు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆగస్టు 1వ తేదీ తరువాత ఇంటికి వచ్చిన లక్ష్మీ మాధురి ప్రియుడు గోపీతో నాగరాజు బతికి ఉండగా మనిద్దరం కలవడం కష్టం, అతడిని ఎవరికీ అనుమానం రాకుండా హత్య చేద్దామని చెప్పడంతో గోపీ స్నేహితుడి సలహా మేరకు 20 నిద్ర మాత్రలు సేకరించారు. ఈనెల 18వ తేదీ రాత్రి నాగరాజుకు భార్య బిర్యానీ చేసి అందులో నిద్రమాత్రలు కలిపినట్లు విశ్వసనీయ సమాచారం. బిర్యానీ తింటుండగానే నాగరాజు మగతగా ఉందని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి పడుకున్నాడు. ఎంతసేపటికీ నాగరాజు ప్రాణం పోకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఇంటిలో లైట్లు వేసుకుని లక్ష్మి మాధురి ఫోర్న్ వీడియోలు చూస్తూ ప్రియుడితో పలుమార్లు మాట్లాడిందని తెలుస్తోంది.
ఆ రాత్రి ఎంతసేపటికీ నాగరాజు ప్రాణం పోకపోవడంతో ప్రియుడికి ఫోన్ చేసి పిలిపించుకుంది. అతడి స్నేహితుడైన ఆర్‌ఎంపీ కూడా వచ్చి నాగరాజును హత్యచేయడంలో సహకరించినట్లు సమాచారం. నాగరాజు రెండు చేతులను గోపీ పట్టుకోగా, గోపీ స్నేహితుడు రెండు కాళ్లు పట్టుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మాధురి నాగరాజు ముఖంపై దిండుపెట్టి ఛాతీపై కూర్చోవడంతో నాగరాజు మృతి చెందినట్లు ఆర్‌ఎంపి డాక్టర్ గుర్తించి వారిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.
న్యూస్‌రీల్
హత్య బయట పడిందిలా..
తెల్లవారుజామున నాలుగు గంటలకే లక్ష్మీ మాధురి నాన్న లేవడం లేదంటూ కుమారుడికి చెప్పడంతో పక్కనే నివాసం ఉంటున్న నాగరాజు తండ్రిని పిలుచుకురాగా, అతడితో పాటు మరికొంతమంది వచ్చి మృతి చెందినట్లు గుర్తించి, ఏసీ బాక్సులో మృతదేహాన్ని ఉంచారు. ఉదయం నాగరాజు స్నేహితులు వచ్చి చెవి కమిలిపోయింది, ముక్క నుంచి రక్తం వచ్చింది అని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ కేసు పెడతామని నాగరాజు తండ్రికి చెప్పడంతో హత్య ఉదంతం బయట పడింది. మొదటి నుంచి నాగరాజు తండ్రి తన కొడుకుని ఇద్దరు చంపడం జరగదని, అందులో ఇంకా కొంతమంది ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. చివరకు ఈ హత్య కేసులో మరొక వ్యక్తి ఉన్నట్లు దుగ్గిరాల పోలీసులు గుర్తించి ఆర్‌ఎంపీ డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పులిచింతల సమాచారం
గుంటూరు
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026
ఐదు నెలల ముందే
● ప్రియుడితో కలసి భర్త ప్రాణం
తీసిన భార్య
● ఆ రాత్రి అంతా ఫోర్న్
వీడియోలతో కాలక్షేపం
● వేధిస్తున్నాడంటూ
ఆగస్టు 1న పోలీసులకు ఫిర్యాదు
● ఆ రోజే రంగప్రవేశం చేసిన ప్రియుడు
● భర్త నాగరాజుకు విడాకులు
ఇస్తానంటూ పోలీస్‌స్టేషన్‌లో యాగీ
చేసిన లక్ష్మీమాధురి
● నిజం తెలిసినా పిల్లల భవిష్యత్తు
కోసం రాజీపడ్డ నాగరాజు
పోలీసుల అదుపులో ఆర్‌ఎంపీ
ముందే అనుమానం వ్యక్తం చేసిన నాగరాజు
ఆర్‌ఎంపీ డాక్టర్ సహకారం ...
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 37.4116 టీఎంసీలు.
1/4
హత్యకు పథక రచన
2/4
హత్యకు పథక రచన
3/4
హత్యకు పథక రచన
4/4
హత్యకు పథక రచన