వర్సిటీనా..టీడీపీ కార్యాలయమా | - | Sakshi
Sakshi News home page

వర్సిటీనా..టీడీపీ కార్యాలయమా

Jan 25 2026 7:18 AM | Updated on Jan 25 2026 7:18 AM

వర్సి

వర్సిటీనా..టీడీపీ కార్యాలయమా

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో టీడీపీ ప్లెక్సీలు

నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకల్లో

పలువురు వర్సిటీ ఉద్యోగులు

పట్టించుకోని వర్సిటీ ఉన్నతాధికారులు

ఏఎన్‌యూ(పెదకాకాని): రాజకీయాలకు అతీతంగా విద్యాబోధనలు చేయాల్సిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని కొందరు ఉద్యోగులు పచ్చ పిచ్చితో టీడీపీ కార్యాలయంగా మారుస్తున్నారు. విద్యాబోధనలతో విరాజిల్లే విద్యాకేంద్రాన్ని కలుషితం చేస్తున్నారు. టీడీపీ ప్రజా ప్రతినిధుల పుట్టిన రోజులు, వారు హాజరయ్యే కార్యక్రమాలు ఉండటమే తరువాయి వెంటనే పలువురు వర్సిటీ ఉద్యోగులు, సిబ్బందితో కూడిన ఫ్లెక్సీలు వర్సిటీలోని రహదారుల వెంట ఏర్పాటు చేస్తున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ నాయకుల ప్లెక్సీల ఏర్పాటు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈనెల 23వ తేదీన రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ పుట్టినరోజును పురస్కరించుకుని పెద్ద ఎత్తున ప్లెక్సీలు అలంకరించారు. ఆ ప్లెక్సీలు కూడా వర్సిటీ ఉద్యోగుల ఫొటోలతో ఏర్పాటు చేయడం విశేషం.

మాజీ సీఎం వైఎస్సార్‌ విగ్రహం

సైతం తొలగింపు...

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశ్వవిద్యాలయంలో రాజకీయాలకు అతీతంగా విద్యాబోధనలు జరగాలనే నినాదంతో వర్సిటీ అధికారులు వీసీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సృష్టికర్త, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని సైతం తొలగించారు. సాక్షాత్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విగ్రహాన్ని తొలగించడంతో శ్రద్ధ చూపిన అధికారులు, వర్సిటీలో అలంకరిస్తున్న నారా లోకేష్‌, ఎమ్మెల్యేల ఫ్లెక్సీల వ్యవహారంలో ఎందుకు స్పందించడంలేదని పలువురు విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. వర్సిటీ ఉద్యోగులే విశ్వవిద్యాలయ ప్రాంగణంలో రాజకీయ నాయకుల ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదనే చర్చ జరుగుతుంది.

ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే ఉద్యోగులపై చర్యలు తీసుకోండి..

మాజీ ముఖ్యమంత్రి విగ్రహం ఉంటేనే విద్యబోధనలు రాజకీయాలకు అతీతంగా జరగాలనే నీతులు చెప్పే అధికారులు పదే పదే టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు వర్సిటీ ఉద్యోగులు రోడ్ల పక్కన ఏర్పాటు చేస్తుంటే రాజకీయాలకు అతీతంగా విద్యాబోధనలు అనే పదం గుర్తుకు రావడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తూ టీడీపీ కార్యాలయం వద్ద కూడా నాయకుల ప్లెక్సీలు రహదారి పొడవునా ఏర్పాటు చేస్తుంటే వర్సిటీలో మాత్రం ఏకంగా లోపలే ఏర్పాటు చేయడం విశేషం. అలా ఏర్పాటు చేసిన ప్లెక్సీలు వారం రోజులకు పైగా అక్కడే ఉంటున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వర్సిటీలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీల ఏర్పాటును నిలిపివేయాలని, రాజకీయాలకు అతీతంగా విద్యాబోధనలు కొనసాగించాలని, వర్సిటీ లోపల రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని పలువురు మేధావులు, విద్యావంతులు కోరుతున్నారు.

వర్సిటీనా..టీడీపీ కార్యాలయమా 1
1/1

వర్సిటీనా..టీడీపీ కార్యాలయమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement