బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేర కు శనివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మహి ళా ప్రాంగణంలోని ప్రభుత్వ ఎస్టీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వసతి గృహంలో సమస్యలను బాలికలను అడిగి తెలుసుకున్నారు. బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు మాట్లాడుతూ న్యాయపరమైన అవగాహన అవసరమని సూచించారు.
తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లా సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్ర 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈనెల 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8.30 గంటలకు ధ్వజారోహణ, పల్లకీ సేవ, సంతానం కోరుకునే వారి కోసం వైనతేయ హోమం నిర్వహించామని తెలిపారు. గరుడ పటం, ధ్వజారోహణ అనంతరం శ్రీ స్వామివారి చేతుల మీదుగా దంపతులకు గరుడ ప్రసాదాన్ని అందించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.
అమరావతి: పంచారామ క్షేత్రాలలో ప్రథమారామక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో శనివారం లోక కల్యాణార్థం ప్రజలంతా సుభిక్షంగా సుఖసంతోషాలతో జీవించాలనే సంకల్పంతో ద్విభాష్యం సూర్యవెంకట అవధానులు సహకారంతో అమరేశ్వరునికి లక్ష బిల్వార్చనను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయ అర్చకులు, వేదపండితులు జరిపించారు. తొలుత మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటుగా గణపతి, రుద్రహోమం నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ అనంతరం సహస్రనామాలతో రుత్విక్కులు అమరేశ్వరునికి లక్ష బిల్వార్చన నిర్వహించారు. బాల చాముండేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): వచ్చేనెల 4, 5, 6 తేదీల్లో నంబూరు రాధా గోవింద మందిరంలో విశాల సాధుసంత్ సమాగమన మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లునిర్వాహకులు ఎం.భాస్కర్‌రెడ్డి, నందిగల లలితలక్ష్మి తెలిపారు. శనివారం బ్రాడీపేటలోని ఓ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆహ్వానపత్రికలను ఆవిష్కరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ భాగవత ధర్మ సమాజ్ సంస్థాపకాచార్య అనంత శ్రీవిభూషిత జగద్గురు శ్రీకృష్ణ చైతన్య మాధ్వ గౌడేశ్వరాచార్య శ్రీపాద కృష్ణబలరామస్వామీజీ మహారాజ్ ప్రభుపాద (యూపీ) నంబూరు గ్రామానికి విచ్చేస్తారని తెలిపారు. వచ్చేనెల 4 ఉదయం సుదర్శనయజ్ఞం, రాత్రి భరతనాట్యం, జానపద నృత్యాలు, ఐదున నృసింహ యజ్ఞం, జగద్గురు సన్మాన సమరోహం, రాత్రి కృష్ణలీలలు, శ్రీనివాస కల్యాణం, ఆరో తేదీన ఉదయం విశేష శోభాయాత్ర (గ్రామోత్సవం) నిర్వహించనున్నట్లు చెప్పారు.
బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి


