ఘోర రోడ్డు ప్రమాదం
ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీ ఆరుగురికి తీవ్ర గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమం
నిడుముక్కల(తాడికొండ): ఎదురెదురుగా వస్తున్న ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ ఘటనా స్థలంలోనే మరణించడంతో పాటు ఆరుగురు తీవ్రగాయాల పాలైన ఘటన నిడుముక్కల శివారు కోళ్లఫారాల వద్ద జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. తెనాలికి చెందిన పెరుగు అమర్ అనే యువకుడు మోతడక చలపతి కళాశాలలో చదువుతున్న మంగళగిరి రూరల్‌కు చెందిన తోకా మహేశ్వరి, తేజస్విని అనే ఇద్దరు యువతులను వాహనంపై ఎక్కించుకొని అధిక వేగంతో గుంటూరు వైపు వెళుతుండగా పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామానికి చెందిన మన్నవ వెంకాయమ్మ, మన్నవ విష్ణుకుమారి, నార్ల రత్తమ్మ, ఆటో డ్రైవర్ మన్నవ సుధాకర్‌లు ఆటోలో ఫంక్షన్ నిమిత్తం వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నార్ల రత్తమ్మ(55) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘోర రోడ్డు ప్రమాదం
ఘోర రోడ్డు ప్రమాదం


