కాల భైరవస్వామికి పూజలు
పెదపులివర్రు (భట్టిప్రోలు): వ్యాఘ్రపుర క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామ దేవత శ్రీ గోగులమ్మ వారి దేవాలయంలో కొలువైన శ్రీ కాల భైరవస్వామి వారికి మార్గశిర బహుళాష్టమి శుక్రవారం ప్రాతఃకాలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ దేవత అమ్మవారి దేవాలయంలో నిత్యపూజ కై ంకర్యాలు విరజిల్లుతూ భక్తుల కోర్కెలు తీర్చే బంగారు కల్పవల్లి అమ్మవారిని భక్తులు సందర్శించారు.
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు సంపత్‌నగర్ శ్రీరామనామ క్షేత్రంలో నిర్వహిస్తున్న 99వ శ్రీరామకోటి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి మూలవిరాట్లకు పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు, అలంకరణ జరిగాయి. ప్రత్యేకంగా అలంకరించిన స్వామి ఉత్సవ మూర్తులను తెప్ప తిరునాళ్లతో మహోత్సవం నిర్వహించారు. అనంతరం హోమం, పూర్ణాహుతి చేయగా, వసంత సేవ, అవబదోత్సవం, చక్రతీర్థం కార్యక్రమాలు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరు కాగా, కార్యక్రమాలను ఆలయ ట్రస్ట్ రాగం వెంకట లీలా సుందరి బెల్లంకొండ మస్తానరావు పర్యవేక్షించారు.
నరసరావుపేట రూరల్: మిరప పంటలో తెగుళ్లు, చీడపీడలను అరికట్టేందుకు సస్యరక్షణ చేపట్టాలని పల్నాడు జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకట్రావు తెలిపారు. జిల్లా ఏరువాక కేంద్రం కో–ఆర్టినేటర్ డాక్టర్ ఎం.నగేష్, నరసరావుపేట ఉద్యాన అధికారి షేక్ నబీ రసూల్‌లతో కలిసి ఆయన శుక్రవారం మిరప తోటలను పరిశీలించారు. పోషక లోప నివారణకు పైపాటుగా 19–19–19, ఫార్ములా–6, మెగ్నీషియం సల్ఫేట్‌ను పిచికారి చేయాలని తెలిపారు. తెల్లనల్లి నివారణకు డైఫెన్డుయురాన్ 1.25 గ్రాములు లేదా స్పెరోమైసిఫెన్ ఒక మి.లీ.ను లీటరు నీటితో కలిపి పిచికారి చేయాలని సూచించారు. తెల్లదోమ నివారణకు ఎకరాకు 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలను పొలంలో ఏర్పాటుచేసి, ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థాయోమిథాగ్సం 0.4 గ్రాములు లేదా స్పెరోమైసిఫెన్ ఒక మీ.లీను లీటరు నీటితో కలిపి పిచికారి చేయాలని సూచించారు. నల్లతామర నివారణకు సైయాన్ట్రనిలిప్రోల్ 240 మి.లీ ఎకరానికి లేదా ఇమిడా క్లోప్రిడ్, ఫెఫ్‌రోనిల్ 50 గ్రాములు రెండు కలిపి ఎకరాకు పిచికారి చేయాలని తెలిపారు.
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): మహా కాల భైరవాష్టమిని పురస్కరించుకుని శుక్రవారం గుంటూరు నల్ల చెరువు ఒకటో వీధిలో శ్రీభవానీ శంకర శివసేన పూజ్య గురువులు శ్రీ సూర్యచంద్రేశ్వరానంద స్వామీజీ ఆధ్వర్యంలో కాల భైరవ జయంతి ఆరాధన శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాకాల భైరవాష్టమి విశిష్టతను భక్తులకు స్వామీజీ వివరించారు. అనంతరం భక్తులకు భారీ అన్న సంతర్పణ నిర్వహించారు.
కాల భైరవస్వామికి పూజలు
కాల భైరవస్వామికి పూజలు
కాల భైరవస్వామికి పూజలు


