నేడు జాతీయ లోక్ అదాలత్
గుంటూరు లీగల్: నాలుగో జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం నిర్వహించనున్నట్లు డీఎల్‌ఎస్‌ఏ చైర్మన్–కమ్– ప్రిన్సిపల్ జిల్లా జడ్జి బి. సాయి కల్యాణ చక్రవర్తి శుక్రవారం తెలిపారు. లోక్ అదాలత్ శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కోర్టు ఆవరణలో జరుగుతుందన్నారు. ఈ అదాలత్‌లో జిల్లా పరిధిలోని సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, వైవాహిక వివాదాలు, ప్రీ లిటిగేషన్ దశలో ఉన్న వివాదాలు తదితర కేసులు పరిష్కారం కోసం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని గుర్తుచేశారు. గుంటూరు నగరంలోని న్యాయ అధికారులు, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు ప్రారంభ సమావేశంలో తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి పలువురిని పలు రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలలో వివిధ హోదాల్లో నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భీమినేని వెంకటలక్ష్మి, సహాయ కార్యదర్శిగా మన్నెం లక్ష్మి, వైఎస్సార్ టీయూసీ సహాయ కార్యదర్శిగా బోరుగడ్డ రజినీకాంత్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.


