మాల ‘గెజిటెడ్ ’ అసోసియేషన్ కార్యవర్గం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : మాల గెజిటెడ్ అధికారుల అసోసియేషన్, (మాల్ గోవా) గుంటూరు జిల్లా సాధారణ సమావేశం స్థానిక ఏసీ లా కాలేజీలో రాష్ట్ర అధ్యక్షులు జంగం విజయానంద్ అధ్యక్షతన జరిగింది. జిల్లా కొత్త కార్యవర్గం ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి రాష్ట్ర సెక్రటరీ జనరల్ పొలకాటి రామకృష్ణ ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా తెనాలి ప్రకాష్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూచిపూడి నెహ్రూబాబు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా బాచు ప్రవీణ్ కుమార్, జనరల్ సెక్రెటరీగా చెరుకూరి జాన్ మణికుమార్, ఉపాధ్యక్షులుగా దాసరి కోటయ్య, పుల్లగూర శామ్యూల్ పాల్, సుధాకర్, తమలపాకుల బుల్లయ్యలు ఎన్నికై నట్లు పేర్కొన్నారు. జాయింట్ సెక్రెటరీలుగా గుంటి ప్రకాష్ ,పచ్చల కుమార్ రాజా ,బెజ్జం రవికుమార్, ఎద్దు రత్నరాజు, ట్రెజరర్‌గా కాలే వెంకటేశ్వర్లు, ఉమెన్ వింగ్ సెక్రటరీగా కొమ్మర్ల ఝాన్సీ రాణి, నీలం రమణ, తెనాలి జోష్ మేరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా గౌతం ప్రసన్న, పి.నమ్రత్ కుమార్ ఎన్నికై నట్లు తెలిపారు.


