ఏపీ కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా పసుపులేటి
చేబ్రోలు: ఏపీ కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా చేబ్రోలు గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసరావును నియమిస్తూ ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర కన్వీనర్‌గా నియమితులైన చేబ్రోలు మండల పరిషత్ ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్న పసుపులేటి శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి మండలంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పసుపులేటిని పలువురు అభినందించారు.
తెనాలి రూరల్: వ్యాపారలలో నష్టం రావడం, తాకట్టు పెట్టిన బంగారం వ్యాపారి మోసం చేయడంతో మనస్తాపానికి గురై బాంగారు ఆభరణాల దుకాణ నిర్వాహకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ రజకపేటకు చెందిన కడప వెంకట్రావు చేబ్రోలు మండలం వేజండ్లలో బంగారు ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడు. అక్కడి ప్రజలు తాకట్టు పెట్టిన ఆభరణాలను తెనాలిలో శ్రీరామమూర్తి వద్ద తాకట్టు పెట్టాడు. వెంకట్రావు వద్ద గతంలో పని చేసిన వ్యక్తి మరో దుకాణాన్ని ప్రారంభించాడు. ఓ వైపు వ్యాపారంలో నష్టాలు రావడం, తెనాలిలో తాకట్టు పెట్టుకున్న శ్రీరామమూర్తి మోసం చేశాడని భావించిన వెంకట్రావు శనివారం తెల్లవారుజామున ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు మెడికల్: జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కోల్డ్ చైన్ పరికరాలు, ఐఎల్‌ఆర్, డీప్ ఫ్రీజర్, వ్యాక్సిన్ క్యారియర్, ఐస్ ప్యాక్ పాడవకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా మెడికల్ ఆఫీసర్, ఫార్మాశిస్టులదేనని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వైద్యులు, వైద్య సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ఫార్మాశిస్టులు లేని చోట స్టాఫ్‌నర్సులను, ఎంపీహెచ్‌ఎస్ సిబ్బందికి కోల్డ్ చైన్ పరికరాలు పాడవకుండా నిర్వహణ బాధ్యతలను వైద్యాధికారి అప్పజెప్పాలన్నారు. తప్పనిసరిగా వ్యాక్సిన్లు ఏవిధంగా నిల్వ ఉన్నాయి, వాటి కాలపరిమితి ఎప్పటి వరకు ఉంది, తదితర విషయాలను ప్రతిరోజూ మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలన్నారు. డీపీఎంఓ డాక్టర్ కె.సుజాత మాట్లాడుతూ ప్రతి ఫార్మశీ అధికారి పీహెచ్‌సీ లేదా అర్బన్ పీహెచ్‌సీల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు.


