గంజాయి తాగుతున్న నలుగురు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి తాగుతున్న నలుగురు అరెస్టు

Oct 2 2025 8:29 AM | Updated on Oct 2 2025 8:29 AM

గంజాయ

గంజాయి తాగుతున్న నలుగురు అరెస్టు

పట్నంబజారు: గంజాయి తాగుతూ, విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పాతగుంటూరు పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్‌ డీఎస్పీ షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌, పాతగుంటూరు పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ కె.వెంకటప్రసాద్‌ వివరాలు బుధవారం వెల్లడించారు. పొన్నూరు రోడ్డులోని ఆంధ్రా ముస్లిం కళాశాల సమీపంలో ఉన్న రేకుల షెడ్డులో కొంత మంది గంజాయి సేవిస్తూ, విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడిచేశారు. ఆనందపేటకు చెందిన షేక్‌ అబూలకర్‌ సిద్ధీక్‌ అలియాస్‌ అబ్బు, లాలాపేటకు చెందిన పోపూరి దేవరాజు, షేక్‌ హుస్సేన్‌, పాతగుంటూరుకు చెందిన షేక్‌ ఇర్ఫాన్‌లు గంజాయి సేవిస్తూ పట్టుపడ్డారు. వారిని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా, గత కొద్దిరోజుల క్రితం గోవా వెళ్లి పలు మత్తు పదార్ధాలకు సంబంధించి బిళ్లలు తీసుకొచ్చి నీటిలో కలిపి ఇంజక్షన్‌ల ద్వారా నరాలకు ఎక్కించుకుంటున్నట్లు గుర్తించారు. దీంతోపాటు, 1200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పలు రకాలకు చెందిన మత్తు బిళ్లలు, ఇంజక్షన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు షేక్‌ అబ్దుల్‌ రెహమాన్‌, ఎన్‌.సి.ప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

గంజాయి తాగుతున్న నలుగురు అరెస్టు 1
1/1

గంజాయి తాగుతున్న నలుగురు అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement