
టిప్పర్‌ను ఢీకొన్న లారీ
డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
చీరాల అర్బన్: మండల కేంద్రం చీరాల 216 జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. చైన్నె నుంచి నిజాంపట్నం వెళుతున్న లారీ ఎంవీఐ కార్యాలయం సమీపంలో ముందు వెళుతున్న టిప్పర్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ పఠాన్ సిరాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను అతికష్టం మీద బయటకు తీసి చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.