
ఆది ఆచార్యులు బ్రాహ్మణులు
నగరంపాలెం: సమాజంలో గురు పరంపరకు మూలం బ్రాహ్మణం అని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం(తిరుపతి) ఉప కులపతి ఆచార్య జి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి అన్నారు. అందుకే ఆది ఆచార్యుల స్థానం బ్రాహ్మణులకే సొంతమని ఆయన పేర్కొన్నారు. ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఏపీలోని 13 జిల్లాలకు చెందిన 56 మంది బ్రాహ్మణ జాతికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను బ్రాడీపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో సత్కరించి, అవార్డులు అందించారు. ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ మాట్లాడారు. కార్యక్రమంలో సమాఖ్య ఉపాధ్యక్షుడు, కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి), శారదాంబ, సమాఖ్య ఉపాధ్యక్షులు మంగళంపల్లి అంజిబాబు, రామభద్రుడు, కసలపాటి లక్ష్మీనారాయణ, పేరి శ్రావణ్, కుప్పం ప్రసాద్, కౌతా ధర్మ సంస్థల అధినేత కౌతా సుబ్బారావు, గుంటూరు బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి రంగావజ్థుల లక్ష్మీపతి, పోతావజ్థుల పురుషోత్తమశర్మ, మాగంటి శాస్త్రి పాల్గొన్నారు.