
ప్రతిభకు ఉపకారం
ఎన్‌ఎంఎంఎస్ దరఖాస్తుకు ఈనెల 30 వరకు గడువు డిసెంబర్ 7న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ సాయం పరీక్షలో ప్రతిభ చూపితే 9వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు ఏడాదికి రూ.12వేలు మంజూరు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతిభే కొలమానంగా ఉపకార వేతనాలు దక్కనున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి, వారికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. ఇందు కోసం ఏటా జాతీయ ప్రతిభా ఉపకార వేతన (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష నిర్వహిస్తోంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ఏపీ మోడల్ స్కూల్స్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. పరీక్షలో ప్రతిభ చూపడం ద్వారా వరుసగా 9,10,11,12వ తరగతుల్లో ఏడాదికి రూ.12వేలు చొప్పున ఉపకార వేతనం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. డిసెంబర్ 7న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏటా 450 మంది విద్యార్థులు ఎంపికవుతున్నారు.
ఎన్‌ఎంఎంఎస్‌కు అర్హతలు
పరీక్ష విధానం