13న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

13న జాతీయ లోక్‌ అదాలత్‌

Sep 11 2025 2:52 AM | Updated on Sep 11 2025 2:55 AM

13న జాతీయ లోక్‌ అదాలత్‌ గుంటూరు లీగల్‌: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో ఈ నెల 13న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్‌ చక్రవర్తి బుధవారం తెలిపారు. లోక్‌ అదాలత్‌లో రాజీ పడ దగిన క్రిమినల్‌, సివిల్‌ కేసులు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. కేసులు రాజీ చేసుకునేందుకు కక్షిదారులు, న్యాయవాదులు సహకరించాలని సూచించారు. జేసీ బాధ్యతల స్వీకరణ గుంటూరు వెస్ట్‌: జాయింట్‌ కలెక్టర్‌గా అశుతోష్‌ శ్రీవాత్సవ బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలివారు. ఇప్పటి వరకు జేసీగా ఇక్కడ పనిచేసిన ఎ.భార్గవ్‌ తేజను ప్రభుత్వం ఈ నెల 3వ తేదీన బదిలీ చేసింది. ఆయన స్థానంలో వచ్చిన అశుతోష్‌ శ్రీవాత్సవను డీఆర్వో షేఖ్‌ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, కలెక్టరేట్‌ ఏఓ పూర్ణచంద్రరావు, తహసీల్దార్‌లు వెంకటేశ్వర్లు, సుభాని, వెంకట స్వామి, మొహర్‌ కుమార్‌, కె.గోపాల కృష్ణ, కలెక్టరేట్‌లోని సెక్షన్‌ అధిపతులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

డాక్టర్‌ దుర్గాభార్గవికి మూడు బంగారు పతకాలు

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ పిల్లల వైద్య విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వనం దుర్గాభార్గవికి మూడు బంగారు పతకాలు దక్కాయి. మంగళవారం విజయవాడలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ 28వ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, బంగారు పతకాలు అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండీ పీడియాట్రిక్స్‌లో అత్యధిక మార్కులు సాధించినందుకు డాక్టర్‌ ధర్మవరపు అమృతవల్లి మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్టు గోల్డ్‌ మెడల్‌, ఎండీ పీడియాట్రిక్స్‌లో ఉత్తమ అవుట్‌గోయింగ్‌ స్టూడెంట్‌గా గుర్తింపు పొందినందుకు డాక్టర్‌ కృష్ణారావు పురోహిత్‌ గోల్డ్‌ మెడల్‌, ఎండీ పీడీయాట్రిక్స్‌ పార్ట్‌–2 పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి ఉత్తమ డిజార్టేషన్‌ సమర్పించినందుకు ఎస్వీరావు అండ్‌ ఎంఎం స్వామి గోల్డ్‌ మెడల్‌ను డాక్టర్‌ దుర్గాభార్గవి అందుకున్నారు. మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశస్వి రమణ, పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్‌ దేవకుమార్‌, పలువురు పిల్లల వైద్య నిపుణులు ఈ సందర్భంగా ఆమెను అభినందించారు.

తురకపాలెంలో ఆర్‌ఎంపీ క్లినిక్‌ సీజ్‌

గుంటూరు రూరల్‌: మండలంలోని తురకపాలెం గ్రామంలో అనధికారికంగా వైద్య సేవలు అందిస్తున్న ఒక ఆర్‌ఎంపీ క్లినిక్‌ను జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ కె. విజయలక్ష్మి బుధవారం సీజ్‌ చేశారు. ఆర్‌ఎంపీ వైద్యుడు సైలెన్‌లు, అధిక మోతాదులోని యాంటీబయాటిక్స్‌ రోగులకు అందిస్తున్నట్లు రుజువు కావటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్‌ఎంపీలు కేవలం ప్రథమ చికిత్సకు మాత్రమే అర్హులని గుర్తుచేశారు. దానికి మించి చికిత్సలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు.

13న జాతీయ లోక్‌ అదాలత్‌  1
1/2

13న జాతీయ లోక్‌ అదాలత్‌

13న జాతీయ లోక్‌ అదాలత్‌  2
2/2

13న జాతీయ లోక్‌ అదాలత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement