మైనార్టీలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు | - | Sakshi
Sakshi News home page

మైనార్టీలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు

Sep 9 2025 8:34 AM | Updated on Sep 9 2025 12:40 PM

మైనార్టీలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు

మైనార్టీలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు

మైనార్టీలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ● వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ గులామ్‌ రసూల్‌ మాట్లాడుతూ ఇటీవల పండుగ సందర్భంగా మైనార్టీ విద్యార్థులకు బుర్ఖాలు వేసి నృత్యాలు చేయించిన భాష్యం స్కూల్‌ అధినేత భాష్యం రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ● వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నూరి ఫాతిమా మాట్లాడుతూ మైనార్టీల ఓట్లతో గద్దెనెక్కిన తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మొహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌లు మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వక్ఫ్‌ బోర్డ్‌ బిల్లు అంశంలోనూ నసీర్‌ మైనారిటీల మనోభావాలను అస్సలు గుర్తించలేదన్నారు. తూర్పు నియోజకర్గ పరిధిలో ముస్లింలు తోపుడు బండ్లపై జీవనం పొందుతుంటే వారిని కూడా తొలగించేందుకు నసీర్‌ సహకరించారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చావుదెబ్బ తింటుందని నూరి ఫాతిమా పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ విభాగం అధికార ప్రతినిధి సయ్యద్‌ అబీబుల్లా, సంయుక్త కార్యదర్శి అప్సర్‌, జిల్లా కార్యదర్శి రజియా బేగం, నియోజక వర్గాల అధ్యక్షులు లియాఖత్‌, ఖాసిం, నూరుల్లా, రబ్బాని, మహబూబ్‌ బాషా, జాని బాషా, కార్పొరేటర్లు అబీద్‌, ఫర్జానా, మైనారిటీ విభాగాల మండల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌: ఎన్నికల సమయంలో మైనార్టీలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాధారుణంగా మోసం చేసిన కూటమి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటుందని వైఎస్సార్‌ సీపీ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షులు పఠాన్‌ సైదాఖాన్‌ తెలిపారు. పార్టీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఇమామ్‌లు, మౌజన్‌లకు ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ. 5000, రూ.10 వేలు చెల్లించారని, కూటిమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా మరచిపోయిందని పేర్కొన్నారు. దీంతోపాటు మసీదుల మరమ్మతులకు ఇస్తామన్న రూ.లక్ష కూడా ఇవ్వలేదని తెలిపారు. నెల వారీ వేతనాలు ఇవ్వకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తమ కాలనీలకు వచ్చిన టీడీపీ శాసన సభ్యులు కనీసం సమస్యలపై స్పందించకపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందని తెలిపారు.

వైఎస్సార్‌ సీపీ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షులు సైదాఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement