
అన్నదాత సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
మేడికొండూరు: అన్నదాత సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తాడికొండ నియోజకవర్గం సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు విమర్శించారు. ఎన్నికల సమయంలో కూటమి అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. ఆదివారం పేరేచర్ల సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర లేదని, నష్టపోతే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేద ని పేర్కొన్నారు. ఈ – క్రాప్ నమోదు చేసిన రైతుల పంటల బీమా ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని తెలిపారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నేడు దాన్ని నిరూపిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయాన్ని అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. యూరియా కోసం రైతులు క్యూ లైన్‌లో నిల్చుంటే వ్యవసాయ శాఖ మంత్రి రైతులు బఫే భోజనం కోసం నిలుచున్నట్లు ఉన్నా రని ఎద్దేవా చేయడం దుర్మార్గమని ఖండించారు. రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని తెలిపారు. మార్క్‌ఫెడ్‌ల ద్వారా యూరియా సరఫరా చేయాల్సిన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గం రైతు విభాగ అధ్యక్షుడు మల్లంపాటి రాఘవరెడ్డి, మండల అధ్యక్షుడు తాళ్లూరి వంశీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి షేక్ మ స్తాన్ వలి, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ రబ్బాని. ఎంపీటీసీ సభ్యులు వల్లెపు శ్రీను, షేక్ బాజీ, మల్లిపెద్ది లక్ష్మీనారాయణ, బొడ్డు పెద్ద సాంబయ్య, ముత్యాల బాలస్వామి, గండికోట రసూలు, కోకా అర్జున్ రా వు, నాసరవల్లి అబ్బాస్, పార్టీ పేరేచర్ల గ్రామ అధ్యక్షులు షేక్ సుభాని, రాఘవరావు, ఉడతా శ్రీనివాసరావు, కిశోర్ రెడ్డి, గొంది రవి, షేక్ బుడే, దండసూరి నారాయణరెడ్డి, కొరివి చెన్నయ్య, అల్లు శ్రీనివాస్ రెడ్డి, భవనం రాజశేఖర్ రెడ్డి, మిరియాల శివరామకృష్ణ, లూర్దు రాజు, నోసిన కోటి, రావిపాటి విజయ చందర్‌రావు, షేక్ జిలాని, ఆలూరి శ్రీను పాల్గొన్నారు.
తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు