
శాసీ్త్రయ సమాజం కోసం పనిచేయాలి
మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు
మంగళగిరిటౌన్: శాసీ్త్రయ సమాజం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. నగర పరిధిలోని ఎస్‌ఎల్‌ఎం చైతన్య హై స్కూల్‌లో ఆదివారం జనవిజ్ఞాన వేదిక జిల్లా 18వ మహాసభలు నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలను కూడా మార్చివేస్తున్నారని అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సినిమాల్లో మతానికి సంబంధించిన అంశాలను మాట్లాడడం సరికాదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు 80 శాతం పైగా చదువుకుంటున్నారని, అలాంటి పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు పాలకులు చూస్తున్నారని విమర్శించారు. ఇటీవల ఉత్తమ అవార్డు పొందిన ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులుగా కేఎస్ లక్ష్మణరావు, టి.రత్నారావు, డాక్టర్ ఏఎస్‌వీఎన్ ప్రసాద్, ప్రొఫెసర్ వేణుగోపాలరావు, అధ్యక్షుడిగా ఉదయ భాస్కర్, ఉపాధ్యక్షులుగా డి.ప్రసాద్, రమేష్, స్వాతి, అహమ్మద్ హుస్సేన్, కోశాధికారిగా రామారావు, ప్రధాన కార్యదర్శిగా జాన్‌బాబు, కార్యదర్శులుగా రాము, ప్రసాద్, వెంకటేశ్వరరావు, భాస్కరరావు, అనీల్‌కుమార్, గోకుల్ చంద్ ఎన్నికయ్యారు.