
సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
మంగళగిరిలో మూసిన నృసింహస్వామి ఆలయ ముఖ ద్వారం
పెదకాకాని శివాలయం తలుపులు మూసి వేస్తున్న అర్చకులు, సిబ్బంది
జిల్లావ్యాప్తంగా
పలు ఆలయాల మూత
సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా పలు ఆలయాలు మూత పడ్డాయి. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులు మధ్యాహ్నం తర్వాత తలుపులు మూసి వేశారు. తిరిగి సోమవారం గ్రహణ శుద్ధి అనంతరం ఉదయం 8 గంటల నుంచి స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని మంగళగిరిలోని నృసింహస్వామి ఈవో సునీల్‌కుమార్ తెలిపారు. పెదకాకాని శివాలయంలో సంప్రోక్షణ అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి భక్తులకు స్వామి దర్శనాలు, అభిషేకాలతో పాటు అన్నిసేవలు యథావిధిగా జరుగుతాయని ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. తెనాలిలోని వైకుంఠపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి భక్తులను అనుమతిస్తామని అర్చకులు తెలిపారు. –మంగళగిరి/తెనాలి/పెదకాకాని

సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025