
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి
నరసరావుపేట: గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్ మాట్లాడారు. మాజీ సీఎం జగన్ రూ.8,850 కోట్లతో 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలకు చర్యలు తీసుకోగా అందులో ఐదింటిని పూర్తిచేసి తరగతులు కూడా ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు పావులు కదుపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్య అందించడం ఇష్టంలేని ముఖ్యమంత్రి చంద్రబాబు మెడికల్ కౌన్సిల్‌కు సీట్లు అవసరం లేదని లేఖ రాశారని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం తెలుగు రాష్ట్ర ప్రజల దురదృష్టకరం అన్నారు. ఆయన పాలన బినామీల ప్రయోజనాల కోసమే అన్నట్లుగా సాగుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందనే దుగ్ధతో చంద్రబాబు ఈ పాపానికి వడిగడుతున్నాడన్నారు. ఈ జీఓను వెనక్కి తీసుకోకపోతే పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కోటపాటి మణికంఠారెడ్డి, బూదాల కల్యాణ్, ఉప్పతోళ్ల వేణుమాధవ్, బంటి, షోయబ్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ నాయకుల డిమాండ్