వైభవంగా నృసింహుని పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా నృసింహుని పవిత్రోత్సవాలు

Sep 4 2025 5:57 AM | Updated on Sep 4 2025 5:57 AM

వైభవం

వైభవంగా నృసింహుని పవిత్రోత్సవాలు

మంగళగిరి: మంగళాద్రిలో వేంచేసివున్న శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు బుధవారం ఉదయం గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం హోమాలు జరిగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను ఈవో సునీల్‌కుమార్‌ పర్యవేక్షించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు.

పశ్చిమ డెల్టాకు 6,830 క్యూసెక్కులు విడుదల

దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 6,830 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌ హైలెవెల్‌కి 296, బ్యాంక్‌ కెనాల్‌కు 1,748 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 598, పశ్చివ కాలువకు 204, నిజాపట్నం కాలువకు 200, కొమ్మూరు కాలువకు 3,120, బ్యారేజి నుంచి సముద్రంలోకి 60,150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

యువతకు ప్రేరణాత్మక

సందేశం

గుంటూరు మెడికల్‌: సర్వేపల్లి రాధాకృష్ణ మనవడు ఎ. సుబ్రహ్మణ్య శర్మ బుధవారం నగరానికి విచ్చేశారు. డాక్టర్‌ శనక్కాయల అరుణ, ఎ.కృష్ణారావుల నివాసానికి బుధవారం వచ్చి యువతతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘ఇండియా ఈజ్‌ ఇన్‌ యువర్‌ హార్ట్‌’ అనే ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. దేశభక్తి, క్రమశిక్షణ, కృషి ద్వారానే యువత తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉదయశంకర్‌, రాధా మాధవి, ఉమా శంకర్‌, రాజ కుమారి పాల్గొన్నారు. ఆత్మీయ ఆతిథ్యంతో అల్పాహారం ఏర్పాటు చేశారు. స్థానిక యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మహాగణపతికి ప్రత్యేక పూజలు

గుంటూరు రూరల్‌: నగర శివారు ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 99 అడుగుల మట్టి మహాగణపతికి శ్రీశైల దేవస్థానం నుంచి తెచ్చిన 36 అడుగుల వరి కంకుల గజమాలను బుధవారం అలంకరణ చేశారు. సింగంశెట్టి సుబ్బారావు దంపతులు వరి కంకుల గజమాలను తెచ్చి స్వామివారికి అలంకరింపజేశారు. సౌత్‌ డీఎస్పీ భానోదయ బుధవారం స్వామి వారిని దర్శించుకుని, పూజలు చేశారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్‌ నరేంద్ర, వైస్‌ చైర్మన్‌ రాజానాయుడు, సెక్రటరీ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం

తిరుమల: టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు గుంటూరు జిల్లాకు చెందిన భక్తుడు ఆలపాటి సురేష్‌ రూ.10,11,111 విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన డీడీని బుధవారం సాయంత్రం తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి స్వయంగా అందజేశారు.

వైభవంగా నృసింహుని  పవిత్రోత్సవాలు 
1
1/4

వైభవంగా నృసింహుని పవిత్రోత్సవాలు

వైభవంగా నృసింహుని  పవిత్రోత్సవాలు 
2
2/4

వైభవంగా నృసింహుని పవిత్రోత్సవాలు

వైభవంగా నృసింహుని  పవిత్రోత్సవాలు 
3
3/4

వైభవంగా నృసింహుని పవిత్రోత్సవాలు

వైభవంగా నృసింహుని  పవిత్రోత్సవాలు 
4
4/4

వైభవంగా నృసింహుని పవిత్రోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement