
దిక్కుతోచని స్థితిలో రైతన్న
గుంటూరు వెస్ట్: దేశానికి వెన్నుముకలాంటి రైతు నేడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండడానికి కూటమి ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి అర్జీ అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, షేక్ నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, వనమా బాలవజ్రబాబు ( డైమండ్ బాబు) దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు షేక్ గులాం రసూల్, నిమ్మకాయల రాజ నారాయణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు వెంకటప్పారెడ్డి, రాష్ట్ర కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ మాజీ చైర్మన్ మండేపూడి పురుషోత్తం, రాష్ట్ర నాయకులు బైరెడ్డి రవీంద్రారెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఆళ్ళ ఉత్తేజ్ రెడ్డి, చిన్నాబత్తిని వినోద్, పవన్ శేషగిరి, దాసరి రాజు, తాడిబోయిన వేణుగోపాలరావు, కె.ప్రేమ్ కుమార్, కార్పొరేటర్లు పడాల సుబ్బారెడ్డి, వెంకట రెడ్డి, ధూపాటి వంశీ, నాయకులు పఠాన్ సైదా ఖాన్, ఎన్.రాజేష్, సీతారామిరెడ్డి, సురసాని వెంకటరెడ్డి, శారద, షేక్ రజియా బేగం పాల్గొన్నారు.
ఎరువులు లేవు.. విత్తనాలు రావు అన్నదాతల పరిస్థితి ఘోరం వైఎస్సార్ సీపీ హయాంలో క్రమం తప్పకుండా పథకాల అమలు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు రైతుల సమస్యలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం పాల్గొన్న పార్టీ నేతలు మోదుగుల, ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి, మురుగుడు, సమన్వయకర్తలు

దిక్కుతోచని స్థితిలో రైతన్న