ఎన్‌సీసీ విద్యార్థుల నగదు స్వాహా | - | Sakshi
Sakshi News home page

ఎన్‌సీసీ విద్యార్థుల నగదు స్వాహా

Jul 13 2025 7:34 AM | Updated on Jul 13 2025 7:34 AM

ఎన్‌సీసీ విద్యార్థుల నగదు స్వాహా

ఎన్‌సీసీ విద్యార్థుల నగదు స్వాహా

పెదకాకాని: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యకు గ్రహణం పట్టింది. కంచే చేను మేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. బదిలీపై వెళ్లిన వ్యాయాయ ఉపాధ్యాయుడు (పీఈటీ)ఎన్‌సీసీ విద్యార్థుల యూనిఫాం కాజేయడంతో పాటు వారి పేరున బ్యాంక్‌లో ఉన్న నగదు కూడా స్వాహా చేశాడు. అంతా తెలిసినా ఉన్నతాధికారులు గానీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గానీ చర్యలు తీసుకోక పోవడం శోచనీయం.

స్కూల్‌కు జిల్లాలోనే ప్రత్యేక స్థానం

మండలంలోని వెనిగండ్ల జెడ్పీ స్కూల్‌కు చదువుతో పాటు ఆటపాటలకు జిల్లాలోనే ప్రత్యేక స్థానం ఉంది. కొంతకాలంగా చదువులోనూ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇటీవల పీఈటీ ఉదంతంతో చెడ్డ పేరు కూడా వచ్చింది. వెనిగండ్ల స్కూల్‌ నుంచి నంబూరుకు బదిలీపై వెళ్లిన వ్యాయామోపాధ్యాయుడు మస్తాన్‌రెడ్డి యూనిఫాం కాజేయడంతో పాటు వారి పేరున బ్యాంక్‌లో ఉన్న నగదు కూడా స్వాహా చేశాడు. ఎన్‌సీసీ విద్యార్థుల తల్లిదండ్రులు నంబూరు వెళ్లి నిలదీయడంతో ఆయన దిగజారుడుతనం వెలుగుచూసింది.

పథకం ప్రకారం నగదు డ్రా

బదిలీపై వెళుతున్న మస్తాన్‌రెడ్డి పథకం ప్రకారం ఎన్‌సీసీ శిక్షణ పొందుతున్న జూనియర్లు 25 మంది, సీనియర్లు 25 మందిని బ్యాంక్‌ వద్దకు తీసుకు వెళ్లాడు. ప్రభుత్వం మంజూరు చేసిన నగదు వారి ఎకౌంట్ల నుంచి డ్రా చేయించి తీసేసుకున్నాడు. జూనియర్ల నుంచి రూ. 3,800, సీనియర్ల నుంచి రూ. 4400 చొప్పున మొత్తం 2 లక్షల రుపాయలకు పైగా స్వాహా చేశాడు. అంతే కాకుండా యూనిఫాం, బెల్ట్‌, టోపీ, షూ మొత్తం పట్టుకుపోయాడు. అంతటితో ఆగకుండా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్ధులు 16 మంది నుంచి రూ. 500 చొప్పున వసూలు చేసుకున్నాడు. త్వరలో ఏ సర్టిఫికెట్స్‌ పొందే విద్యార్థులు ఫుల్‌ యూనిఫాంతో హాజరు కావాల్సి ఉంది.దాన్ని పీఈటీ తీసుకు వెళ్లాడని తెలుసుకున్న తల్లిదండ్రులు నంబూరు పాఠశాలకు వెళ్లి నిలదీశారు. స్కూల్‌కు సంబంధించిన ఆట వస్తువులు కూడా మాయమైనట్లు సమాచారం. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వివరణ కోరగా ఎన్‌సీసీ విద్యార్థుల వ్యవహారం తన దృష్టికి వచ్చిందని, అయితే విద్యార్థులు గానీ, తల్లిదండ్రులు గానీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని, ఎన్‌న్‌సీసీ సర్టిఫికెట్లు మంజూరుకు ఆటంకం కలుగకుండా చూడాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు కోరుతున్నారు.

వ్యాయాయ ఉపాధ్యాయుడి నిర్వాకం

స్కూలుకు వెళ్లి నిలదీసిన తల్లిదండ్రులు చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు, ప్రధానోపాధ్యాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement