
కూలి పనులకు వెళ్తేనే కుటుంబం గడుస్తుంది
నమ్మకంగా మోసం చేశాడు.
మనందరి జీవితాలు బాగుపడాలంటే లోన్లు తీసుకుందామంటూ మాతో పాటు పనికి వచ్చే రాజశేఖరరెడ్డి చెప్పాడు. మనం కూడా కాంట్రాక్ట్ తీసుకుని పనులు చేద్దాం అంటూ మాయమాటలు చెప్పాడు. ముందుగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దామని చెప్పి ఖాతా తెరవడానికి అవసరమైన రూ.10వేలు అతనే కట్టి, బ్యాంక్ ఖాతా పుస్తకాలు కూడా ఇవ్వలేదు. ఆరు నెలల తరువాత బ్యాంక్ వారు మీరు తాకట్టుపెట్టిన బంగారు రుణం సమయం అయిపోయింది. రిలీజ్ చేసుకోవాలంటూ నోటీసులు పంపిస్తున్నారు. ఇప్పుడు రాజశేఖరరెడ్డిని అడిగితే మాట దాటవేస్తున్నాడు.
– ఎస్‌కె సలీం, నులకపేట
రోజూ తాపీపనికి వెళితేనే నా కుటుంబం గడుస్తుంది. రాజశేఖరరెడ్డి మాతోపాటు కూలిపనులు చేసుకునేవాడు. కొంచెం చదువుకుని ఉండడంతో మాకు మాయమాటలు చెప్పి లోన్లు వస్తాయని చెప్పి అకౌంట్లు ఓపెన్ చేయించి ఈ పని చేశాడు. ఇప్పుడు ఎవరు బంగారం తాకట్టు పెట్టారని అడిగితే టెక్కి ప్రకాష్, మదన్ అని చెబుతున్నాడు. వారు మాకు ముఖ పరిచయం మాత్రమే. జరిగిన సంఘటనపై అధికారులను, మంత్రులను కలుద్దామని అనుకుంటున్నాం. నా పేరుమీద రూ.35 లక్షల బంగారం లోన్ తీసుకున్నట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.
– ఎస్‌కే మీరావలి, నులకపేట

కూలి పనులకు వెళ్తేనే కుటుంబం గడుస్తుంది