గుంటూరుమెడికల్ : ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్టాఫ్‌నర్సులుగా పనిచేస్తున్న 19 మందికి గుంటూరు ఆర్డీ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించి హెడ్‌నర్సులుగా ఉద్యోగోన్నతి కల్పించారు. కౌన్సెలింగ్‌కు 20 మందిని పిలువగా, ఒకరు ఉద్యోగోన్నతి వద్దని లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చా రు. ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి, డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ సుధీర్, సీనియర్ అసిస్టెంట్ షేక్ నాగూర్ షరీఫ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు.
యోగా గురువు పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ ఆవరణంలోని ప్రభుత్వ యునాని, న్యాచురోపతి యోగ వైద్యశాలలో యోగా గురువుగా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ రావూరి మౌనిక తెలిపారు. యోగాలో పీజీ, లేదా డిప్లమోలో అనుభవం ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. మహిళా అభ్యర్థులు యోగా గురువులుగా పనిచేసేందుకు కావాలన్నారు. మహిళ యోగా గురువుకు ప్రతిరోజూ గంటకు రూ. 250 చొప్పున, 20 గంటలకు నెలకు గౌరవ వేతనంగా రూ. 5వేలు అందిస్తారన్నారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు 8309599643 నంబరులో సంప్రదించాలని యునాని వైద్యురాలు డాక్టర్ మౌనిక కోరారు.
సోమేశ్వరస్వామి
దేవాలయానికి శంకుస్థాపన
బాపట్ల: బాపట్ల పట్టణంలోని సోమేశ్వరస్వా మి దేవాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోన రఘుపతి నిర్వహించా రు. గురువారం ఉదయం భక్తిశ్రద్ధలతో హోమం చేపట్టారు. ఆలయం ప్రధాన అర్చకులు బాబీస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోన రఘుపతి, ఆయన సతీమణి రమాదేవిస్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు స్వామి వారి చిత్రపటాలను అందించారు. కార్యక్రమంలో సోమేశ్వరస్వామి దేవాలయంలో కె.శివరామప్రసాద్, కొటికం సుబ్బారావు, వెదురుపర్తి లక్ష్మణమూర్తి, కొట్రా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మకు
బంగారు రాళ్లహారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు చిలకలూరిపేటకు చెందిన భక్తులు గురువారం బంగారు రాళ్ల హారాన్ని కానుకగా సమర్పించారు. చిలకలూరిపేటకు చెందిన నక్కా రమేష్‌బాబు, కోటేశ్వరమ్మ దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. సుమారు 61.8 గ్రాముల బంగారం, రాళ్లతో తయారు చేయించిన హారాన్ని ఆలయ ఈఈ కోటేశ్వరరావుకు అందజేశారు. అమ్మవారి ఉత్సవాల్లో ఈ హారాన్ని వినియోగించాల్సిందిగా దాతలు ఆల య అధికారులను కోరారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం భాగ్యం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
యార్డుకు 1,24,248 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 1,24,248 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,19,823 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ. 20,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 21,500 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.13,000 వరకు ధర పలికింది.


