మిర్చి యార్డు చైర్మన్
నిమ్మకాయల రాజనారాయణ
కొరిటెపాడు(గుంటూరు): కోల్డ్ స్టోరేజీల యాజమాన్యం ప్రతినెలా స్టాకు వివరాలను మార్కెట్ యార్డు అధికారులకు అందజేయాలని గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారా యణ ఆదేశించారు. మిర్చి దిగుమతిదారుల అసోసియేషన్, కోల్డ్ స్టోరేజ్‌ల అసోసియేషన్, కార్మిక సంఘాల నాయకులు, అధికారులతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజనారాయణ మాట్లాడుతూ యార్డు అధికారులు ఎప్పటికప్పుడు కోల్డ్‌స్టోరేజీలలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మచ్చుకాయల నియంత్రణలో భాగంగా కోల్డ్‌స్టోరేజీల వద్ద ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి, కోల్డ్‌స్టోరేజీల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రకాశరావు, సురేంద్రబాబు, మిర్చి దిగుమతిదారుల అసోసియేషన్ అధ్యక్షుడు లేళ్ల పెద అప్పిరెడ్డి, సాంబిరెడ్డి, కార్మిక సంఘం నాయకుడు శ్రీనివాసరెడ్డి, యార్డు అధికారులు శివారెడ్డి, సుబ్రమణ్యం, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.