గుంటూరు రూరల్: తెలుగు కవులలో పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల సాహిత్యం ప్రత్యేకమైందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎ.విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నగర శివారుల్లోని లాంఫాంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పుట్టపర్తి నారాయణాచార్యుల 108వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. వీసీ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో అగ్రగణ్యుడు, బహుభాషాకోవిదుడని కొనియాడారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎల్.ప్రశాంతి, విస్తరణ సంచాలకులు డాక్టర్ బి.విజయాభినందన, సామాజిక విజ్ఞాన శాస్త్రం పీఠా ధిపతి డాక్టర్ సీహెచ్ చిరంజీవి, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ ఎ.మణి, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి.సుధాకర్, కంట్రోలర్ ఎ.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ విష్ణువర్థన్ రెడ్డి


