కేవీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

తెనాలిఅర్బన్‌: తెనాలి చినరావూరులోని కేంద్రియ విద్యాలయంలో తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ప్రిన్సిపాల్‌ శ్రీకాంత్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీటీలో హిందీ, ఇంగ్లిషు, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ, టీజీటీలో హిందీ, ఇంగ్లిషు, సంస్కృతం, సోషల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, పీఆర్పీ, స్టాఫ్‌ నర్సు, కోచ్‌ ఫర్‌ స్పోర్ట్స్‌, కౌన్సిలర్‌, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటలకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. సర్టిఫికెట్‌లతో పాటు దరఖాస్తు, బయోడేటా ఫారాలు తీసుకురావాలని తెలిపారు. వివరాలకు https://tenali.kvs.ac.in లో సంప్రదించాలన్నారు.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top