క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం

ఫుడ్‌ బాస్కెట్లు అందజేస్తున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, జేసీ రాజకుమారి - Sakshi

గుంటూరు మెడికల్‌: ప్రధానమంత్రి టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం గుంటూరు కలెక్టరేట్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో టీబీ వ్యాధిగ్రస్తులకు పోషక ఆహార పదార్థాల కిట్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. టీబీ వ్యాధిగ్రస్తులకు ఫుడ్‌ బాస్కెట్‌లు కలెక్టర్‌ అందజేసి, దాతలు నిక్షయ్‌ మిత్ర డోనర్స్‌ను అభినందించారు. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వారు కనెక్ట్‌ టూ ఆంధ్ర ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ గర్నమెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ద్వారా జిల్లాలోని 1200 మంది టీబీ రోగులకు ఆరు నెలలపాటు పోషకాహార పదార్థాలు అందజేసేందుకు ముందుకు వచ్చినందుకు కలెక్టర్‌ వారిని అభినందించారు. ఫుడ్‌ బాస్కెట్‌లో మూడు కేజీల రాగిపిండి, కేజీ వేరుశనగలు, కేజీ కందిపప్పు, కేజీ శనగలు, లీటరు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఉన్నాయని టీబీ జిల్లా ఆఫీసర్‌ డాక్టర్‌ భూక్క్యా లక్ష్మానాయక్‌ తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి, జిల్లా రెవెన్యూ ఆఫీసర్‌ కె.చంద్రశేఖరరావు, నేషనల్‌ టీబీ ఎలిమినేషన్‌ ప్రోగ్రాం జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.రమేష్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ అమర్తలూరి శ్రావణబాబు, గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి, ఛాతీ, సాంక్రమిత వ్యాధుల హాస్పటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీకంటి రఘు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీజినల్‌ మేనేజర్‌ పి.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆలయ గుమస్తాపై సస్పెన్షన్‌ వేటు!

మంగళగిరి: నగరంలో వేంచేసి వున్న లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఆదాయం పక్కదారి పట్టించి, స్వాహా చేసిన ఘటనలో గుమస్తా వాసుపై ఉన్నతాధికారులు శనివారం సస్పెన్షన్‌ వేటు వేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు సస్పెన్షన్‌తో సరిపెట్టకుండా చట్టప్రకారం పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాసుతో పాటు, అతనికి సహకరించిన వారిపైనా చర్యలు తీసుకుని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top