టైమ్‌ మిషన్‌: ప్రపంచ చరిత్రనే మార్చిన యుద్ధం | Battle of Gaugamela: Alexander the Great’s Historic Victory | Sakshi
Sakshi News home page

టైమ్‌ మిషన్‌: ప్రపంచ చరిత్రనే మార్చిన యుద్ధం

Oct 4 2025 7:38 AM | Updated on Oct 4 2025 10:14 AM

Special Story On Battle of Gaugamela

గౌగమేలా యుద్ధం ఊహాచిత్రం – బ్రిటిష్‌ మ్యూజియంలోని శాసనం

ప్రపంచ చరిత్రలో అత్యంత నిర్ణయాత్మకమైన యుద్ధాలలో ‘గౌగమేలా’ యుద్ధం ఒకటి. ఈ యుద్ధంలో మేసిడోనియా యువరాజు అలెగ్జాండర్‌... అకిమెనిడ్‌ పారసీక సామ్రా జ్యపు చక్రవర్తి డరియస్‌–3ను చిత్తు చేశాడు. దీనితో ప్రపంచ చరిత్ర గతే మారి పోయింది. గ్రీకు సేనలకు ఆసియా ద్వారాలు తెరచుకున్నాయి.

గౌగమేలాకు ముందు ‘ఇసస్‌’ యుద్ధంలో (క్రీ.పూ. 333) కూడా డరియస్‌ను అలెగ్జాండర్‌ ఓడించాడు. కానీ ఆ విజయం పారసీక సామ్రా జ్యాన్ని బలహీనం చేయలేకపోయింది. ఈసారి డరియస్‌ తన సామ్రాజ్య అపారమైన వనరులను ఉపయోగించుకుని భారీ సైన్యాన్ని (సుమారు లక్షన్నర నుంచి రెండున్నర లక్షల మంది) సమ కూర్చుకున్నాడంటారు. అలెగ్జాండర్‌ కేవలం తన 47,000 మంది సైనికులతో ఈ భారీ సైన్యాన్ని ఎదుర్కొని విజయం సాధించడంలో అతడి యుద్ధ తంత్రమే ప్రధాన కారణం అయ్యింది.

మెసపొటోమియా ఉత్తర ప్రాంతం (ప్రస్తుత ఇరాక్‌)లోని గౌగమేలా మైదానంలో క్రీస్తు పూర్వం 331 అక్టోబర్‌ మొదటివారంలో (1వ తేదీ) జరిగిన ఈ యుద్ధంలో... డరియస్‌ తన రథాలను, యుద్ధ గజాలను ప్రధాన ఆయు ధాలుగా ఉపయోగించాలని భావించాడు. అందుకే సమతలమైన ఈ మైదానాన్ని యుద్ధ క్షేత్రంగా ఎంచుకున్నాడు. కానీ అలెగ్జాండర్‌ ఈ వ్యూహాన్నే తనకనుకూలంగా మార్చుకున్నాడు.

మైదానంలో ఎడమవైపు ఉన్న జాగాలో డరి యస్‌ తన అపార సైన్యాన్ని మోహరించి ఉన్నాడు. అతి కొద్ది సైన్యాన్ని డరియస్‌ను ఎదు ర్కోవడానికి అలెగ్జాండర్‌ అక్కడ మోహరించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్థానాన్ని వీడకుండా ఉండాలని ఆదేశించాడు. ప్రధాన సైన్యాన్ని కుడి వైపునకు మరల్చి దూరంగా పొమ్మని ఆజ్ఞ జారీ చేశాడు. 

ఇది చూసిన డరియస్‌ చుట్టూ ఉన్న సైన్యం... శత్రుసైనికులు వెనక్కి తిరిగి పారి పోతున్నారని భావించి వారిని వెంబడించడం ప్రారంభించింది. దీంతో డరియస్‌ చుట్టూ ఖాళీ ఏర్పడింది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న అలెగ్జాండర్‌ తనను వెన్నంటి ఉన్న సుశిక్షిత అశ్విక దళంతో శరవేగంతో ఆ ఖాళీలో ప్రవేశించి డరియస్‌ను చుట్టుముట్టాడు.

అలెగ్జాండర్‌ అత్యంత వేగంగా సైన్యాన్ని నడిపిస్తూ డరి యస్‌ చుట్టూ ఉన్న సైన్యాన్ని ఊచకోత కోశాడు. ఎడమవైపుకు డరియస్‌ సైనికులు పారిపోకుండా అంతకు ముందే మోహరించి ఉన్న తన కొద్ది పాటి సైనిక సమూహం వీరోచితంగా పోరా డుతూ ప్రధాన సైన్యం విజయం సాధించేంత వరకు తమ స్థానాన్ని కాపాడుకుంది. వారు వెనక్కి తగ్గి ఉంటే అలెగ్జాండర్‌  ప్రణాళిక విఫ లమై ఉండేది. ప్రస్తుతం బ్రిటిష్‌ మ్యూజియంలో భద్రపరచబడిన ఓ మృత్తికా ఫలక శాసనం (క్లే టాబ్లెట్‌ ఇన్‌స్క్రిప్షన్‌)లో ఈ వివరాలు ఉన్నాయి.

యుద్ధ ప్రాముఖ్యం
గౌగమేలా యుద్ధం తరువాత, అకిమెనిడ్‌ సామ్రాజ్యం అంతరించిపోయింది. డరియస్‌ తప్పించుకున్నాడు. కానీ అలెగ్జాండర్‌ పారసీక రాజదానులైన బాబిలోన్, సూసా, పెర్సెపోలిస్‌ లను సులభంగా స్వాధీనం చేసుకున్నాడు. యుద్ధం తరువాత, గ్రీకు సంస్కృతి, ఆచారాలు ప్రాచ్య ప్రపంచంలోకి వ్యాపించడానికి మార్గం సుగమమైంది. ఈ సంస్కృతుల మిశ్రమమే ‘హెలె నిస్టిక్‌ యుగం’గా ప్రసిద్ధికెక్కింది. ఇది శాస్త్రీయ, సాంస్కృతిక, రాజకీయ రంగాల అభివృద్ధికి దోహ దపడింది. ఈ విజయం తరువాత, అలెగ్జాండ ర్‌ను ‘అలెగ్జాండర్‌ ద గ్రేట్‌’ అని పిలవడం ప్రారంభమయ్యింది. చరిత్రలో ఆయన గొప్ప వారిలో అత్యంత గొప్పవాడిగా నిలిచాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement