మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్‌ | Sakshi
Sakshi News home page

మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్‌

Published Fri, Apr 19 2024 3:09 PM

Would Never Get Pregnant And Have A Child Unless Got Married said Masaba Gupta - Sakshi

మసాబా గుప్తా ఫ్యాషన్ పరిశ్రమలో పెద్దగా పరిచయం అవసం లేదు. రెడ్ కార్పెట్ ఈవెంట్‌ల నుండి వివాహాలు , ఫోటోషూట్‌ల వరకు  పాపులర్‌ డిజైనర్‌గా పాపులర్‌ అయింది. తన క్రియేటివిటీ అందర్నీ కట్టిపడేసింది. అంతేకాదు తన జీవిత కథ  ఆధారంగా రూపొందించిన డాక్యు-సిరీస్ మసాబాతో నటిగా అవతరించింది. ఇటీవల  నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది.

తాజాగా తాను తల్లికాబోతున్నానని ఇన్‌స్టా ద్వారా ప్రకటించింది. ‘‘మా జీవితాల్లోకి రెండు బుల్లి బుల్లి అడుగులు రాబోతున్నాయి.. మమ్మల్ని ఆశీర్వ దించండి,  అలాగే మీ ప్రేమను, కొద్ది బనానా చిప్స్‌ను(plain salted ONLY)’’ అంటూ తాను తల్లికాబోతున్న విషయాన్ని ఫ్యాన్స్‌తో షేర్‌ చేసింది. అంటే తనకు బనానా చిప్ప్‌ తినాలనిపిస్తోందని చెప్పకనే చెప్పింది. కొన్ని ఎమోజీలను  పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా గతంలో మసాబా వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. చెప్పినట్టే చేసిందంటూ ఫ్యాన్స్‌ కమెంట్స్‌  చేశారు. 

సింగిల్ పేరెంటింగ్ అనే కాన్సెప్ట్ మోడ్రన్‌గా ఉన్నా, పెళ్లి కాకుండానే బిడ్డను కనడం నార్మల్‌గా మారినా, , తాను అలా చేయకూడదనుకుంటున్నానని ఆమె వెల్లడించింది. ‘ఆధునిక మహిళగా పెళ్లి చేసుకుని బిడ్డనుకనే  ధైర్యం ఉందా? అంటే .అస్సలు లేదు. ఎందుకంటే అంత ఒత్తిడిని తీసుకోవాలని  లేదు. అలాంటి వాతావరణంలో బిడ్డను ఉంచాలని తాను భావించడం లేదని గతంలో ఒక ఇంటర్వ్యలో పేర్కొంది. పెళ్లి కాకుండా పుట్టిన తనకి చాలా మోడ్రన్‌  అనే ట్యాగ్ వేశారు. ఆధునికంగా ఉండటం చాలా అద్భుతమే కానీ  తాము చాలా అవమానాల్ని ఎదుర్కొన్నామని  గుర్తు చేసుకుంది. 

కాగా  బాలీవుడ్ నటి, నీనా గుప్తా , వెస్ట్ ఇండియన్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ప్రేమ కథ అందరికి సుపరిచితమే.ఈ జంటకు ప్రేమ ఫలితమే మసాబా గుప్తా. అయితే పెళ్లికాకుండానే నీనా బిడ్డను కనడం అప్పట్లో పెద్ద సంచలనం.  నీనా, రిచర్డ్స్‌ని  పెళ్లి చేసుకోలేదు.  కానీ  ఒంటరిగానే  తన కుమార్తె మసాబాను పెంచి పెద్ద చేసి ప్రయోజకురాల్ని చేసింది. 

Advertisement
 
Advertisement