కలుపు.. అంటే రైతులు ఆ పొలంలో ఆ పంట సాగు కాలంలో అవాంఛితంగా పెరుగుతున్న రకరకాల మొక్కలను కలుపు మొక్కలు అని పిలుస్తున్నాం. వేల సంవత్సరాల సుసంపన్న సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానం కలిగిన భారతీయ రైతాంగానికి ఒక్క గ్రాము కలుపు మందును వాడకుండా వ్యవసాయం చేసే వారసత్వం ఉంది. అయినా, ఆధునిక వ్యవసాయ పోకడల నేపథ్యంలో కలుపు మొక్కలను నియంత్రించే మందుల వినియోగం పెరిగిపోయింది. రసాయనిక లేదా పారిశ్రామిక వ్యవసాయం ఊపందుకున్నాక.. ఏదో ఒకటే పంటను పొలమంతా వేసి పండించే ఏక పంటల (మోనోకల్చర్) సాగు విస్తృతం అయిన తర్వాత.. గడ్డి లేదా కలుపు నిర్మూలన మందుల వాడకం పెరిగింది. అప్పటికి ఇది రైతుకు సులువైన పరిష్కారంగా, ఖర్చు తక్కువతో పూర్తయ్యే పనిగా తోచినప్పటికీ.. గడ్డి మందులకు అనేక రకాలుగా దుష్పరిణామాలు ఉంటాయని ప్రపంచ దేశాల అనుభవాలు చెబుతున్నాయి. మట్టిలో సూక్ష్మజీవరాశి నశించి వ్యవసాయం సమస్యల్లో పడుతుంది. గాలి, నీరు కలుషితమవుతుంది. మనుషుల ఆరోగ్యం దెబ్బతింటుంది.
పారాక్వాట్, గ్లైఫొసేట్ వంటి కలుపు మందుల వాడకంతో రైతులు, రైతు కూలీలు, వినియోగదార్లలో కేన్సర్లు, ప్రాణాంతక జబ్బులు ప్రబలుతున్నాయని చెప్పటానికి ప్రపంచ దేశాల్లో ఆధారాలకు కొదువ లేదు. కాబట్టి, రసాయనాలు చల్లకుండా కలుపు నిర్వహణపై భారతీయ వ్యవసాయ వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడం అవసరమని కొందరు నిపుణులు చెబుతున్నారు. దేశంలో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విస్తరణకు గతంలో కన్నా ఎక్కువగా కృషి జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఇది ఒక అనివార్యం. కలుపు మందుల నిరోధకత, కలుపు మందులతో వ్యవసాయ – పర్యావరణ ప్రభావాలు, కలుపు మొక్కలపై ప్రాకృతిక దృక్పథం, సమగ్ర కలుపు నిర్వహణ పద్ధతులు ఏమిటో చర్చించటమే ఈ కథనం లక్ష్యం.
కలుపు మొక్కల ‘ఉపయోగాలు’ మీకు తెలుసా!
రైతులు సాగుచేసే పంటలతో సూర్యరశ్మి, తేమ, పోషకాల కోసం కలుపు మొక్కలు పోటీ పడుతుంటాయి. తద్వారా పంట దిగుబడిని, నాణ్యతను ప్రభావితం చేస్తాయి. పంటకు తెగుళ్ళు, ఇతర చీడపీడలను కలిగిస్తాయని కూడా భావిస్తారు. కలుపు మొక్కలు మామూలు పంటలకన్నా చాలా ఎక్కువ మొత్తంలో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి, చాలా వేగంగా పెరుగుతాయి. కొన్ని గడ్డి మొక్కలు రకాలు మొలకెత్తిన ఒక నెల కంటే తక్కువ సమయంలోనే విత్తనాల ఉత్పత్తిలో చివరి దశకు చేరుకోగలవు. ఇంకా కొన్ని కలుపు మొక్కలు అల్లెలోపతి (రసాయనాలను ఉత్పత్తి చేసే లక్షణం) ప్రభావాలను కూడా సృష్టిస్తాయి. తద్వారా ఆర్థికంగా రైతుకు ముఖ్యమైన పంటల పెరుగుదలకు సవాళ్లు విసురుతాయి. అవి మనం తీసుకునే నియంత్రణ చర్యల కంటే ఒక అడుగు ముందే ఉంటాయి!
మనకు అవసరమైన పంట మొక్కల కన్నా వేగంగా పెరిగే ఈ కలుపు మొక్కలు వాటిని నియంత్రించటానికి మనం చేసే ప్రయత్నాలన్నింటినీ తప్పించుకుంటాయి. అన్నిటికంటే నష్టం కలిగించే వార్షిక కలుపు మొక్కలు బతికేది స్వల్పకాలమే కావచ్చు, కానీ వాటి విత్తనాలు మార్గం దీర్ఘ కాలం బతికి వుండి చాన్నాళ్ల తర్వాత కూడా మొలకెత్తుతాయి. అందువల్ల కలుపును పూర్తిగా నిర్మూలించడం దాదాపు అసాధ్యం అవుతోంది. ఒక సంవత్సరం విత్తనంతో ఏడు సంవత్సరాల పాటు కలుపు మొక్కలు మొలుస్తూనే ఉంటాయట. స్థానిక వాతావరణంలో పుట్టి పెరిగే కలుపు మొక్కలు కొన్నయితే, విదేశాల నుంచి వచ్చి చేరి స్థానిక మొక్కలకు చోటివ్వకుండా విపరీతంగా పెరిగిపోయే పార్థీనియం/ వయ్యారిభామ వంటి ప్రమాదకరమైన కలుపు మొక్కలు కొన్ని.
కలుపు మొక్కల వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుంది. మట్టి పైపొరలో క్షీణించిన ఖనిజాలను భూగర్భం నుంచి పైపొర మట్టిలోకి తీసుకువచ్చి, పంట మొక్కలకు అందుబాటులో ఉంచుతాయి.
కలుపు మొక్కలు గట్టి మట్టిపెడ్డలను విచ్ఛిన్నం చేసి నేలను గుల్లచేస్తాయి. తరువాత వేసే పంటల వేర్లు లోతుగా వెళ్లడానికి మార్గం సుగమం చేసాయి. సూక్ష్మజీవులకు మంచి వాతావరణాన్ని అందించడానికి అవి నేలను వదులుగా, పొరలుగా చేస్తాయి. తద్వారా నేలను సుసంపన్నం చేస్తాయి.
నేల స్థితిగతులు ఎలా ఉన్నాయో, మట్టిలో పోషక లోపాలు ఏమిటో సూచిస్తాయి.
భూమి లోతుల్లోకి వేర్లను చొప్పించే కలుపు మొక్కలు పోషకాలను తీసుకుంటూ.. పైపైన వేర్లతో ఉండే ఇతర జాతుల మొక్కలు కరువు బారిన పడకుండా తట్టుకునేలా దోహదం చేస్తాయి.
సాగు చేసే పంటల వేర్లకు అందుబాటులో లేని పోషకాలను అందుకోవటానికి ‘సహచర పంటలు’గా కలుపు మొక్కలు సహాయపడతాయి.
కలుపు మొక్కలు మట్టి పైపొరను కప్పి ఉంచటం ద్వారా ఆ మట్టి నుంచి ఖనిజాలు, పోషకాలు కొట్టుకుపోకుంగా నిల్వ చేస్తాయి, అందుబాటులో ఉంచుతాయి.

నేలను కప్పి ఉంచుతూ సూర్యకాంతి నుంచి రక్షిస్తాయి. ప్రవహించే వాన నీరు, గాలుల వల్ల నేల కోతకు గురికాకుండా కలుపు మొక్కలు కాపాడతాయి.
అనేక ప్రయోజనకరమైన కీటకాలు, మాంసాహారులు, పరాన్నజీవులు, పరాగ సంపర్కాని ఉపయోగపడే జీవులకు కలుపు మొక్కలు ఆహారాన్ని, ఆశ్రయాన్ని కల్పిస్తాయి.
చాలా జంతువులకు, మానవులకు ఆహారంగా, ఔషధాలుగా ఉపయోగపడతాయి. వాటి ఔషధ విలువలు తెలియక మనం అవి కలుపు మొక్కలనుకొని నిర్మూలిస్తుంటాం.
చాలా రకాల కలుపు మొక్కలు నిజానికి పుష్కలంగా పోషక విలువలను కలిగి వుంటాయి. సాగు చెయ్యని ఆకుకూరలుగా, మందు మొక్కలుగా వ్యవసాయ కుటుంబాలకు గొప్పగా దోహదపడతాయి. అలాగే కరువు సమయాల్లో ఆహారాన్ని కూడా అందిస్తాయి. వీటిలో చాలా వాటిని కొందరు గ్రామీణులు సేకరించి మార్కెట్లలో కూడా అమ్ముతారు.
కేరళలోని వాయనాడ్ జిల్లాలో ‘థనల్’ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో, 83 రకాల ఆకుకూరలను (సాధారణంగా కలుపు మొక్కలుగా వర్గీకరించబడినవి) ఆ ప్రాంత ప్రజలు ఆహారంగా వినియోగిస్తున్నట్లు కనుగొన్నారు. వాటిలో 20 రకాలు వరి పొలాల్లో లభించాయి.
ప్రకృతిలో అన్నీ మొక్కలే.. ‘కలుపు’ మొక్కల్లేవు!
ప్రకృతి దృష్టికోణంలో ‘కలుపు మొక్కలు’ అనేవి ఉండవు. కలుపు అనేది మానవుల భావన. ఎందుకంటే మనం ఒక పంటను ΄పొలంలో పెంచుకుంటూ ఉంటే మనం కోరకుండా వాటంతట అవే పెరిగే మొక్కలను మనం ‘కలుపు మొక్కలు అని పిలుస్తున్నాం. అయితే, మనం కలుపు అనుకునే మొక్కలు ఒక ప్రత్యేక వాతావరణంలో, ప్రత్యేకమైన మట్టిలో కొన్ని కలుపు మొక్కలు పెరగడానికి ప్రకృతి సంబంధమైన కారణాలు అనేకం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటికి ప్రకృతిపరంగా ముఖ్యమైన పాత్రలు, విధులు ఉంటాయి. కలుపు మొక్కలు ప్రకృతిపరంగా బాగా అనుకూలతను కలిగి ఉంటాయి. మనం విత్తనాలు/మొక్కలు నాటి సాగు చేసే పంటలు జీవించడం కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఆ పొలంలోనే అనేక కలుపు మొక్కలు పెరగడానికి ఇదే కారణం. కొన్ని పరిస్థితులలో పంట మొక్కల కంటే కలుపు మొక్కలు మరింత దృఢంగా ఉంటాయి. కలుపు మొక్కలు సూక్ష్మమైన శక్తులు. అవి ప్రకృతి సమతుల్యతకు సహాయపడతాయి.
అందుకనే, ‘నేలపై నియంత్రణ సాధించడంలో కలుపు మొక్కలు మానవ వైఫల్యాన్ని సూచిస్తాయి. ప్రజలు తప్పులు చేసిన చోట అవి సమృద్ధిగా పెరుగుతాయి. అవి మన తప్పులను, ప్రకృతి చేపట్టిన దిద్దుబాట్లను సూచిస్తాయి’ అంటారు అమెరికాకు చెందిన ప్రసిద్ధ బయోడైనమిక్ శాస్త్రవేత్త డా. ఎహ్రెఫ్రై డ్ ఫైఫర్.
ఉదాహరణకు.. సియామ్ కలుపు మొక్క లేదా ఫ్లాస్ ఫ్లవర్ (క్రోమోలీనా ఒడోరాటా) అనేది ఒక భయంకరమైన కలుపు మొక్క. ఇది అడవులను అక్రమిస్తూ అక్కడ అనాదిగా సహజంగా పెరిగే మొక్కలు, చెట్ల జాతుల జీవవైవిధ్యాన్ని తగ్గించడానికి కారణమవుతుంది. అయితే, ఇది చెట్లు లేని వాలు ప్రాంతాల్లో పెరిగి, నేలను త్వరగా ఆక్రమించుకుంటుంది, ఇతర మొక్కలు పెరగడానికి అనుమతించదు. చాలా సందర్భాలలో, ఇది నేలను పట్టి ఉంచి, నేల కోతను నిరోధించే ఏకైక మొక్క. త్వరగా కుళ్ళిపోయే దాని ఆకులు తూర్పు భారతదేశంలో ఝుమ్ వ్యవసాయ పద్ధతిలో పండించే వివిధ రకాల పంటలకు మంచి ఎరువుగా ఉయోగపడుతుంటాయి. కొన్ని రకాల పోషకాలు లోపించిన నేలల్లో కొన్ని రకాల ప్రత్యేక కలుపు మొక్కలు పెరుగుతాయట.
రైతులు సాగుచేసే పంటలతో సూర్యరశ్మి, తేమ, పోషకాల కోసం కలుపు మొక్కలు పోటీ పడుతుంటాయి. తద్వారా పంట దిగుబడిని, నాణ్యతను ప్రభావితం చేస్తాయి. పంటకు తెగుళ్ళు, ఇతర చీడపీడలను కలిగిస్తాయని కూడా భావిస్తారు. కలుపు మొక్కలు మామూలు పంటలకన్నా చాలా ఎక్కువ మొత్తంలో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి, చాలా వేగంగా పెరుగుతాయి. కొన్ని గడ్డి మొక్కలు రకాలు మొలకెత్తిన ఒక నెల కంటే తక్కువ సమయంలోనే విత్తనాల ఉత్పత్తిలో చివరి దశకు చేరుకోగలవు. ఇంకా కొన్ని కలుపు మొక్కలు అల్లెలోపతి (రసాయనాలను ఉత్పత్తి చేసే లక్షణం) ప్రభావాలను కూడా సృష్టిస్తాయి. తద్వారా ఆర్థికంగా రైతుకు ముఖ్యమైన పంటల పెరుగుదలకు సవాళ్లు విసురుతాయి. అవి మనం తీసుకునే నియంత్రణ చర్యల కంటే ఒక అడుగు ముందే ఉంటాయి!
మనకు అవసరమైన పంట మొక్కల కన్నా వేగంగా పెరిగే ఈ కలుపు మొక్కలు వాటిని నియంత్రించటానికి మనం చేసే ప్రయత్నాలన్నింటినీ తప్పించుకుంటాయి. అన్నిటికంటే నష్టం కలిగించే వార్షిక కలుపు మొక్కలు బతికేది స్వల్పకాలమే కావచ్చు, కానీ వాటి విత్తనాలు మార్గం దీర్ఘ కాలం బతికి వుండి చాన్నాళ్ల తర్వాత కూడా మొలకెత్తుతాయి. అందువల్ల కలుపును పూర్తిగా నిర్మూలించడం దాదాపు అసాధ్యం అవుతోంది. ఒక సంవత్సరం విత్తనంతో ఏడు సంవత్సరాల పాటు కలుపు మొక్కలు మొలుస్తూనే ఉంటాయట. స్థానిక వాతావరణంలో పుట్టి పెరిగే కలుపు మొక్కలు కొన్నయితే, విదేశాల నుంచి వచ్చి చేరి స్థానిక మొక్కలకు చోటివ్వకుండా విపరీతంగా పెరిగిపోయే పార్థీనియం/ వయ్యారిభామ వంటి ప్రమాదకరమైన కలుపు మొక్కలు కొన్ని.
కలుపు మందులకు నిరోధకత
కలుపు మందుల మార్కెట్ మన దేశంలో 2025లో 393 మిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. 2030 నాటికి 608 మిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. పెరుగుతున్న కలుపు కూలీల ఖర్చు తగ్గించుకోవటానికి రైతులు కలుపు మందులు చల్లుతున్నారు. అయితే, కలుపు కూలీల ఖర్చే కాదు మొత్తంగా సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. రైతు అధికంగా ఖర్చు పెట్టిన తర్వాత గిట్టుబాటు ధర లభించనప్పుడు కూలీల ఖర్చు భరించటం వారికి సమస్యగా మారుతోంది. కలుపు మందుల మార్కెట్‌లో సింహభాగం గ్లైఫోసేట్, 2,4–డి ఆక్రమిస్తున్నాయి. గ్లైఫోసేట్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన వ్యవసాయ రసాయనం. 2024లో రైతులకు వచ్చిన ఆదాయంలో నేల కోసం పెట్టిన ఖర్చు వాటా 46.5%కు పెరిగిందని అంచనా. కలుపు మందును తట్టుకునే నిషిద్ధ బీటీ పత్తితో సహా వాణిజ్య పంటల విస్తరణ ఏటా 9.31% పెరుగుతున్నట్లు చెబుతున్నారు.
కలుపు మందులు కొట్టినా కలుపు చనిపోకుండా నిరోధకత పెంచుకోవటం ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారింది. దీర్ఘకాలికంగా బీటీ పంటలను సాగుచేస్తున్న దేశాల స్థాయిలో మన దేశంలో ఇంకా నిరోధకత లేదు. అయినప్పటికీ, కలుపు మందును తట్టుకునే నిషిద్ధ పత్తి సాగు వ్యాప్తితో పెరుగుతున్న కలుపు మందుల వాడకం ఆందోళన కలిగిస్తున్నది. వరి పొలాల్లో కూలీలతో కలుపు తీసే పద్ధతిలో కూడా కలుపు మొక్కలు రంగు మార్చుకొని తప్పించుకుంటున్నాయి.
మన దేశంలో కలుపు మందులకు నిరోధక శక్తిని పెంచుకున్న కలుపు మొక్కల సంఖ్య పెరుగుతున్నది. తట్టుకునే శక్తిని పెంచుకున్న కలుపు మొక్కలను లక్ష్యంగా చేసుకునే కొత్త కలుపు మందుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మొండి కలుపుపై చల్లటానికి అనేక కొత్త మందులు అభివృద్ధి చెందే క్రమంలో ఉన్నాయి. గ్లైఫోసేట్ కలుపు మందుకు 50కి పైగా కలుపు జాతులు ఇప్పుడు నిరోధకతను ప్రదర్శిస్తున్నాయి. పాత కలుపు మందులు పనిచేయకపోతే మరింత విషపూరిత కలుపు మందులను రైతులు వాడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది పొలంపై, పంటపై రసాయనాల భారాన్ని తీవ్రతరం చేస్తోంది. ఈ పొలాల్లో నుంచి నీరు పొంగి పొర్లిన సందర్భంలో నాచుకు, ఉభయచరాలకు ఈ రసాయనాలు హాని చేస్తాయి.
ప్రాక్వాట్ అనే కలుపు మందు మట్టికి గట్టిగా అంటుకుంటుంది. అది పై పొరలలో ఉండి ఉత్పాదకతకు కీలకమైన నత్రజనిని స్థిరీకరించే మంచి బ్యాక్టీరియాకు హాని కలిగిస్తుంది. తక్కువ సాంద్రతలలో కూడా ఈ మందు జలచరాలు, తేనెటీగలు, ప్రయోజనకరమైన కీటకాలకు అత్యంత విషపూరితమైనది. 30 కంటే ఎక్కువ కలుపు జాతులు ఇప్పుడు దానికి నిరోధకతను సంతరించుకున్నాయి. అంటే, ఈ మందు కొట్టినా ఈ కలుపు మొక్కలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఎక్కువసార్లు పిచికారీ చేయటం వల్ల కలుపు మొక్కల రకాలు తట్టుకొని దీర్ఘకాలం బతికే జాతులుగా మారుతున్నాయి. ప్రాక్వాట్ నేల ఆరోగ్యాన్ని, వాన పాముల సంఖ్యను భారీగా తగ్గిస్తుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిషేధం విధించటం హర్షదాయకం. అదే విధంగా, 2,4 డిని 80 సంవత్సరాలకు పైగా ఉపయోగించిన తర్వాత 40 కంటే ఎక్కువ కలుపు జాతులు దానికి నిరోధకతను పెంచుకున్నాయి.
పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలు
రసాయనిక కలుపు మందులకు అనేక పర్యావరణ హితమైన సమర్థ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కొందరు రైతులు కలసి సహకార యాజమాన్యంలో యంత్రాలతో కలుపుతీసే పద్ధతులతో పాటు సేంద్రియ/ప్రకృతి సేద్య మిశ్రమ పంటల సాగు పద్ధతులను అనుసరించవచ్చు. కలుపు మొక్కలు పెరగనీయకుండా అంతరాయం కలిగించే అంతర పంటలు, పంటల మార్పిడి, నేలను కప్పి వుంచే పంటలు సాగు చెయ్యటం, పంట వెయ్యటానికి ముందు పొలానికి నీటి తడి పెట్టి కలుపు మొలిచిన తర్వాత దుక్కి చేసి ఆ తర్వాత పంట వేసుకోవటం ద్వారా కలుపు సమస్యను అధిగమించటం వంటి అనేక పద్ధతులు కలుపు మందులకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఈ పద్ధతులు కలుపు మొక్కలను అణచివేయటం, నేల ఆరోగ్యాన్ని పెంపొందించటంతో పాటు విలువైన పర్యావరణ సేవలను అందిస్తాయని గుర్తించడం అవసరం.
ఎద్దులతో గుంటకలు తోలి కలుపు నివారించే సాధనాలను ఉపయోగించే సాంప్రదాయ పద్ధతులు, కోనో–వీడర్లు, రోటరీ వీడర్లు, సైకిల్ వీడర్లు వంటి ఆధునిక ఆవిష్కరణలతో కలిపి సమర్థవంతమైన కలుపు తొలగింపు మార్గాలను అనుసరించవచ్చు. దానితో పాటు ఈ పనుల ద్వారా మట్టి లోపలికి గాలిని ప్రసరింపజేయటం, తెగుళ్లు కలిగించే పురుగుల జీవిత చక్రాలకు అంతరాయం కలిగించటం, కలుపు మొక్కలను పచ్చి రొట్ట ఎరువుగా తయారుచేసి నేలలో కలపటం ఈ పద్ధతుల్లో సాధ్యపడుతుంది. తద్వారా రసాయన ఉత్పాదకాలపై ఆధారపడకుండా బహుళ వ్యవసాయ ప్రయోజనాలను ఈ పద్ధతులు సాధిస్తాయి.
అంతేకాదు, ఈ విధానాలు రైతు స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేస్తాయి. గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. తరతరాల పర్యావరణ జ్ఞానాన్ని కాపాడతాయి. నేల సారానికి నష్టం చేయకపోగా పెంపొందిస్తాయి. విషం లేని ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి.
రసాయనాలు లేకుండా కలుపు మొక్కలను నియంత్రించటం అనేది సాంకేతికమైన విషయమా లేదా రాజకీయ, ఆర్థిక విషయమా అనేది ప్రాథమిక ప్రశ్న. వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు పర్యావరణ మార్పును తట్టుకునే స్థితిని కల్పించటానికి ఉపయోగపడే వ్యవసాయ పర్యావరణ శాస్త్రం అభివృద్ధిపై భారతదేశం పెట్టుబడి పెడుతుందా లేదా రసాయనాల వాడకాన్ని పెం΄÷ందించే పద్ధతులను ప్రోత్సహిస్తుందా అన్నది కాలం తేల్చాల్సిన విషయం.
హెక్టారులో 40 కోట్ల పార్థీనియం విత్తనాలు!
ఒక పార్థీనియం మొక్క 15 వేల నుంచి 20 వేల విత్తనాలను ఉత్పత్తి చేయగలదు. ఇది పొలంలోనే లేదా నేలలోనే ఒక భారీ, నిరంతర విత్తన బ్యాంకు ఏర్పడటానికి దారి తీస్తుంది. హెక్టారు భూమిలో విత్తనాల దశ వరకు పార్థీనియం మొక్కలను పెరగనిస్తే ఆ పొలంలో 40 కోట్ల విత్తనాలు తయారు చేసినట్లే. అవి మైళ్ళ దూరం ప్రయాణించి, అనేక దశాబ్దాల పాటు జీవిస్తాయి. అవి మానవులను, జంతువులను అంటుకొని ప్రయాణిస్తాయి. మరికొన్ని మన పొలాల్లో వాలే పక్షుల ద్వారా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి.
చాలా ఏళ్లపాటు బతికే కలుపు మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా వేర్ల ద్వారా, ఊడల్లాంటి (రన్నర్లు లేదా స్టోలన్) తీగల ద్వారా వ్యాప్తిచెందుతాయి. తెల్ల క్లోవర్ కలుపు మొక్క 50 మీటర్ల పొడవున తీగను పాకించగలదు. వేరు దుంపల ద్వారా కొన్ని కలుపు మొక్కలు నిరంతరం విస్తరిస్తూ ఉంటాయి. హార్స్‌టెయిల్ వేరు దుంపలు 5 మీటర్ల లోతులో 100 మీటర్ల దూరం వరకు చొచ్చుకెళ్లి మొక్కల్ని మొలిపించగలదు. నేలపై ఒక చోట కలుపు మందుతోనో, చేతితోనే తీసేసి నిర్మూలించినా నేలలో దుంప నుంచి మళ్లీ పెరుగుతూనే ఉంటుందన్న మాట.
చాలా కలుపు మొక్కలు లోతైన వేర్లను కలిగి ఉంటాయి. ఇవి కొమ్మలు, రెమ్మలను తొలగించినప్పుడు కూడా పునరుత్పత్తి చేయగలవు. ఆక్సాలిస్ జాతి దుంప రకం కలుపు మొక్క ఒక సీజన్‌లో 6900 మొక్కలుగా పెరుగుతుంది. నేలకు కరుచుకొని, పొట్టిగా, పాకుతూ పెరుగుతుండటం వలన యంత్రాలతో వీటిని తొలగించినప్పటికీ తప్పించుకుని బతుకుతాయి.