Skin Care Tips: డ్రైఫ్రూట్స్‌, గుడ్లు, చేపలు తిన్నారంటే..

Try These Home Remedies To Banish Dry Skin In Winter Season - Sakshi

సీజన్‌ మారితే మన శరీరంలో కూడా మార్పులు వెంటనే చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో పొడి చర్మం మరింతగా వేదిస్తుంది. వాతావరణంలో తేమ స్థాయిలు తక్కువైనా, చలి లేదా వేడిగా ఉన్నా, వేడి నీళ్లతో స్నానం చేస్తున్నా.. చర్మం పొడిబారిపోతుంది. ఐతే మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారా సహజమైన పద్ధతుల్లో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మీకు తెసుసా!

జర్నల్‌ ఆఫ్‌ డెర్మటాలజీ అండ్‌ కాస్మొటాలజీ ప్రకారం ప్రొటీన్లు, తాజా పండ్లు, కూరగాయలు వంటి  నీటి శాతం పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకున్నట్లయితే చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌లా సహాయపడతాయని పేర్కొంది. లోపల్నుంచి తగిన పోషకాలను అందిస్తే చర్మానికి మరింత మేలు చేకూరుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. ఏ ఆహారం తీసుకుంటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

డ్రైఫ్రూట్స్‌
ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొవ్వులు డ్రైఫ్రూట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్‌ స్ట్రేస్‌ కలిగించే హానికారకాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. కాబట్టి ఒక స్పూన్‌ లేదా గుప్పెడు డ్రైఫ్రూట్స్‌ ప్రతిరోజూ తినడం వల్ల అధిక క్యాలరీలు అందడమే కాకుండా మీ శరీర కాంతిని మెరుగుపరుస్తుంది.

సోయ
సోయలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. దీనిలోని ఐసోఫ్లేవోన్స్‌ కొల్జాజెన్‌ను కాపాడి చర్మ ముడతలను నివారించడంలో సహాయపడుతుంది. సోయ పాలు లేదా టోఫు ఏ విధంగా తీసుకున్న చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

టమాట
టమాటాల్లో విటమిన్‌ ‘సి’, లైకొపీన్‌ అనే యాంటీఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేసి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. టమాటాలను ఉడికించి క్రీమీ పేస్ట్‌లా లేదా తక్కువ నూనెలో వేయించి అయినా తినొచ్చు.

చేప
చేపలో ఒమేగా-3 కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఐతే ఇవి సహజంగా శరీరంలో ఉత్పత్తి కావు. కణత్వచం (పై పొర) ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు ఒమేగా 3 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మీ చర్మాన్ని ఎల్లప్పుడూ తడిగా ఉంచుతుంది.

గుడ్డు
సల్ఫర్‌, లూటీన్‌ గుడ్డులో అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృధువుగా, చెమ్మగా ఉంచుతుంది. అల్పాహారంలో లేదా ఇతర ఏ పద్దతుల్లో తిన్నా మంచిదే.

సిట్రస్‌ ఫ్రూట్స్‌
విటమిన్‌ ‘సి’ ఈ పండ్లలో నిండుగా ఉంటుంది. ఆరెంజ్‌, కిన్నో, స్వీట్‌ లెమన్‌.. వంటి పండ్లలో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. అంతేకాకుండా హైడ్రేషన్‌ను అందిస్తుంది.

క్యారెట్‌
బేటా కెరోటిన్‌, విటమిన్‌ ‘సి’లకు క్యారెట్‌ బెస్ట్‌. ఈ రెండు విటమిన్లు చర్మకాంతిని మెరుగుపరచడంలో, వృద్ధాప్యాన్ని నివారించడంలో తోడ్పడతాయి.  ఫ్రీ రాడికల్స్‌ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి.

ఈ ఆహారపు అలవాట్లు మీ శరీరసోయగాన్ని మరింత పదిలంగా కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు.

చదవండిZinc Rich Diet: వీటిలో జింక్‌ పుష్కలంగా ఉంటుంది.. ఇవి తింటే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top