ట్రావెలింగ్‌లో బెస్ట్‌.. ఈ కెటిల్‌ని మడిచి బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు | Sakshi
Sakshi News home page

ట్రావెలింగ్‌లో టీ, కాఫీ లేకుండా ఉండలేరా? ఈ కెటిల్‌ బెస్ట్‌ ఛాయిస్‌

Published Wed, Dec 20 2023 4:46 PM

Travel Foldable Fast Boiling Electric Kettle - Sakshi

డ్రై బర్న్‌ ప్రొటెక్షన్, ఆటోమేటిక్‌ షట్‌ ఆఫ్‌ వంటి ఆప్షన్స్‌తో రూపొందిన ఈ ఫోల్డబుల్‌ కెటిల్‌.. టూరిస్ట్‌లకు ఎంతో ఉపయుక్తం. హై క్వాలిటీ 304 స్టెయిన్‌ లెస్‌ స్టీల్, ఫుడ్‌–గ్రేడ్‌ సిలికాన్‌ మెటీరియల్‌తో తయారైన ఈ పరికరం చాలా తేలికగా.. ట్రావెలింగ్‌ బ్యాగ్స్‌లో పెట్టుకునేందుకు అనువుగా ఉంటుంది.

స్టీమింగ్‌ అండ్‌ ఇన్సులేషన్‌ ఫంక్షన్‌ తో ఉన్న ఈ కెటిల్‌లో ఆన్‌  ఆఫ్‌ బటన్తో‌ పాటు టెంపరేచర్‌ బటన్‌ కూడా కలసి ఉంటుంది. ఇందులో కాఫీ, టీ, గ్రీన్‌  టీ, బ్లాక్‌ టీ, వేడినీళ్లతో పాటు.. సూప్స్‌ వంటివీ చేసుకోవచ్చు.

అలాగే గుడ్లు, జొన్న కండెలను ఉడికించుకోవచ్చు. అవసరాన్ని బట్టి కెటిల్‌ని మడిచి, హ్యాండిల్‌ని ఎడమవైపు 90 డిగ్రీస్‌ తిప్పి ప్యాక్‌ చేసుకోవచ్చు. లేదంటే చిత్రంలో చూపించిన విధంగా హ్యాండిల్‌ని పెద్దగా చేసుకుని కెటిల్‌ని పట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.ధర 33డాలర్లు (రూ.2,752) 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement