ఏకంగా రూ.7 కోట్ల  భూమిని విరాళమిచ్చిన మహిళ, ఎందుకో తెలుసా?

TN  Woman donates Rs 7cr land in memory of daughter gets cm reward - Sakshi

జనవరి 26  గణ తంత్ర దినోత్సవాల్లో తమిళనాడు సీఎం ప్రత్యేక   అవార్డును ఒక పేద మహిళ గెల్చుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు  ఏకంగా రూ.7 కోట్ల రూపాయల విలువైన భూమిని  ప్రభుత్వ  పాఠశాల కోసం  విరాళంగా ఇచ్చినందుకు ఆమెకు ఈ   అవార్డు దక్కింది.  

ఆమె పేరు ఆయి అమ్మాళ్‌ను  అలియాస్ పూరణం. ఆమె మదురై జిల్లా పూడూర్‌నివాసి.  నిరుపేద పిల్లల అభ్యున్నతికి కృషి చేసిన తన దివంగత కుమార్తె  జ్ఞాపకార్థం ఆమె తన 7 కోట్ల రూపాయల విలువైన భూమిని  తమిళనాడు ప్రభుత్వానికి అందించడం విశేషంగా నిలిచింది..  సంబంధధి పత్రాలను చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కె కార్తిగాకు అందజేశారు. అమ్మాళ్ చేసిన దాతృత్వానికి స్పందించిన తమిళనాడు సీఎం  గణతంత్ర దినోత్సవ వేడుకల్లో  ప్రత్యేక అవార్డుతో   ఆమెను ఘనంగా సత్కరించారు.

అమ్మాళ్‌ కెనరా బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తోంది. కోడికులంలోని పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్‌కు హైస్కూల్‌గా అభివృద్ధి చేసేందుకు  దాదాపు రూ. 7 కోట్ల విలువైన స్థలాన్ని జనవరి 5న  విరాళంగా ఇచ్చింది. రెండేళ్ల క్రితం మరణించిన తన కుమార్తె  జనని పేరును పాఠశాలకు పెట్టాలన్నది ఆమె కోరిక.  దీంతో సోషల్‌ మీడియాలో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

కాగా చిన్నప్పటి నుంచి కష్టాలను అనుభవించిన పూర్ణం, జనని చిన్నపిల్లగానే ఉన్నపుడే  భర్తను కోల్పోయింది.  భర్త చనిపోయిన తరువాత కారుణ్య ప్రాతిపదికన తన భర్త ఉద్యోగాన్ని పొందింది. కష్టపడి బిడ్డను బి.కామ్ దాకా చదివించుకుంది. కానీ అనూహ్యంగా జనని కూడా చనిపోయింది. దీంతో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని నిరుపేద  పిల్లలు చదువుకోవాలంటూ విరాళంగా ఇచ్చేసింది.  అలా తన బిడ్డను కల నెరవేర్చాలని భావించింది.

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top