
ఇటీవలి జీవనశైలిలో ఒత్తిడి ఓ అనివార్యమైన విషయం. ఒత్తిడి (స్ట్రెస్) ప్రభావం దేహంలోని అనేక అవయవాల మీద ప్రతికూలంగా పడుతుందన్న సంగతి తెలిసిందే. చాలామందికి తెలియనిదేమిటంటే... ఒత్తిడి ప్రభావం కంటిపై కూడా ఉంటుందని! చాలాకాలం పాటు కంటి మీద పడే ఒత్తిడి అనేక కంటి సమస్యలను తెచ్చిపెడుతుందంటున్నారు కంటి వైద్య నిపుణులు. సుదీర్ఘకాలం పడే ఒత్తిడి కారణంగా కంటికి సంబంధించి స్వల్పమైనవి మొదలు చాలా తీవ్రమైన అనర్థాల వరకూ ఏర్పడడతాయని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం.
ఒత్తిడి మన అంతర్గత అవయవాలపైనా, మెదడుపైనా ప్రతికూల ప్రభావాలను చూపి, అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఉదాహరణకు గుండె, మానసిక ఆరోగ్యం, జీర్ణవ్యవస్థ మొదలైన అంశాలపై ఒత్తిడి ప్రభావం చాలా తీవ్రంగానే పడి గుండె΄ోటు మొదలుకొని, జీర్ణసమస్యలూ, మానసిక సమస్యలూ వస్తాయి. అలాగే కంటి విషయంలో ఒత్తిడి తన దుష్ప్రభావాన్ని ఎలా తెచ్చిపెడుతుందో తెలుసుకుందాం.
కంటిపై ఒత్తిడి దుష్ప్రభావం ఎలాగంటే...
కంటిపై పడే దుష్ప్రభావాలకంటే ముందుగా... అసలు ఒత్తిడి వల్ల దేహంపై కలిగే ప్రభావాలేమిటో, అసలవి ఎందుకు కలుగుతాయో చూద్దాం. అపాయకరమైన పరిస్థితుల్లో ఒత్తిడి కలుగుతుంది. తీవ్రమైన ఒత్తిడిలో దేహం ‘ఫైట్’ లేదా ‘ఫ్లైట్’ అనే పరిస్థితికి సిద్ధమవుతుంది. అంటే పోరాడు’ కుదరకపోతే పారిపో’ అనే పరిస్థితులకు దేహాన్ని సిద్ధం చేస్తుంది. ఈ సమయంలో దేహంలో కార్టిసోల్, అడ్రినలిన్ అనే హార్మోన్లు వెలువడతాయి.
ఆ హార్మోన్ల వల్ల దేహం చాలా కొద్ది వ్యవధిలోనే పారిపోవడానికి లేదా పోరాటానికి అవసరమైన బలాన్ని ఎక్కువ మొత్తంలో విడుదలయ్యేలా చేస్తుంది. పదే పదే కలిగే ఒత్తిడి కారణంగా కండరాలు ఒత్తిడికి గురి కావడం, వాటికి అవసరమైన రక్తప్రవాహం అందక΄ోవడం, కండరాల్లో ఇన్‌ఫ్లమేషన్ వంటి అనర్థాలు ఏర్పడే అవకాశాలుంటాయి. కంట్లో ఉండేవీ కండరాలే కావడంతో అన్ని కండరాల్లాగానే వీటిపైన కూడా ఆ దుష్ప్రభావాలు పడతాయి.
కంటిపై ఒత్తిడి పెంచే అంశాలివి...
ఎప్పుడూ ఒత్తిడికి గురయ్యేవారిలో కళ్లపై కొన్ని దుష్ప్రభావాలు పడతాయి. అన్ని రకాల ఒత్తిళ్లతో పాటు మరికొన్ని అంశాలు కళ్లపై తమ ప్రభావాన్ని నేరుగా పడేలా చేస్తాయి. అవి... ఎక్కువ సేపు స్క్రీన్‌ను చూస్తుండటం. (అది టీవీ, కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ ఏదైనా కావచ్చు); నిద్రలేకపోవడం; వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటుండటం... ఇవన్నీ కంటిపైనా ఒత్తిడి పడేలా చేస్తాయి.
ఒత్తిడి కారణంగా వచ్చే కంటి సమస్యలివి...
కన్ను స్ట్రెయిన్ కావడం (ఏస్థెనోపియా) : డిజిటల్ స్క్రీన్స్‌కు నిత్యం ఎక్స్΄ోజ్ అవుతూ ఉండటం. ఈ కారణంగా కళ్లు స్ట్రెయిన్ అవుతుంటే తలనొప్పి, కళ్లు ΄÷డిబారడం, మసక మసగ్గా కనిపించడం వంటివి.
డ్రై ఐస్ : ఒత్తిడి కారణంగా కళ్లలో స్రవించే నీరు (కన్నీరు లేదా లాక్రిమస్ సెక్రిషన్) తగ్గుతుంది. దీని కారణంగా కళ్లు పొడిబారడంతో పాటు కళ్లలో ఇసకపడ్డట్లు ఫీలింగ్, ఇరిటేషన్, కళ్లమంటల వంటి లక్షణాలు కనిపిస్తాయి.
బ్లర్‌డ్ విజన్ : కంటి చుట్టూతా ఉండే కండరాలు ఒత్తిడితో బిగుసుకుపోతున్న కారణంగా... చూపు స్పష్టంగా కనిపించక ఎదుటనున్నవి మసక మసగ్గా కనిపిస్తాయి. ఒక్కోసారి ఒత్తిడి కారణంగా కళ్లలో సన్నటి కన్నీటి పొర అవరించినప్పుడూ ఇలా మసగ్గా కనిపించవచ్చు.
కన్ను అదరడం (ట్విచ్చింగ్) : కన్ను అదరడం చాలామందిలో కనిపించే సాధారణమైన అంశం. కన్ను అదరడాన్ని బట్టి కొందరు శుభసూచనలను / అశుభసూచకాలను దీనికి ఆ΄ాదిస్తుంటారు. ఇలా కన్ను అదరడాన్ని (ట్విచ్చింగ్‌ను) దీన్నే వైద్య పరిభాషలో ‘మయోకైమియా’ అంటారు. ఇది దీనివల్ల ఎలాంటి హానీ ఉండదు. అయితే ఒక్కోసారి తీవ్రమైన ఒత్తిడి కారణంగా కన్ను అదురుతుండటం చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది.
కాంతికి ప్రతిస్పందించడం (లెట్ సెన్సిటివిటీ) : తీవ్రమైన కాంతిలో కన్ను చాలా ఇబ్బందికి గురయ్యే విషయం తెలిసిందే. ఒత్తిడితో కన్ను రెండు రకాలుగా ఇబ్బంది పడుతుంది. తీవ్రమైన ఒత్తిడి... మైగ్రేన్‌ను కలగజేస్తుందన్న విషయం తెలిసిందే. మైగ్రేన్‌లో కన్ను మామూలు కాంతిని కూడా చూడలేక΄ోతుంది. అలాగే ఆరుబయట తీవ్రమైన కాంతి ఉన్నప్పడూ కన్ను తెరుచుకోడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది.
కొన్ని కంటి భ్రమలూ, భ్రాంతులు (విజువల్ హేలూసినేషన్స్) : అరుదుగా కొన్ని సందర్భాల్లో కంటికి కొన్ని దిగ్భ్రమలు కలుగతాయి. దాంతో కంటి ముందు లేనివి కూడా ఉన్నట్లు కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని కాంతిపుంజాలు వెలుగుతున్నట్లుగానూ, అవి తేలుతూ పోతున్నట్లుగానూ (వీటినే ఫ్లోటర్స్ అంటారు), మెరుపులు మెరుస్తున్నట్లుగా దిగ్భ్రమలు కలగవచ్చు. కొన్నిసార్లు తాత్కాలికంగా కన్ను దేన్నీ చూడలేకపోవచ్చు కూడా. ముఖ్యంగా ఇలాంటివి ఆక్యులార్ మైగ్రేన్ అనే కండిషన్‌లో కలుగుతాయి.
మేనేజ్‌మెంట్ / చికిత్స...
లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. ఉదాహరణకు కన్ను పొడిబారిన సందర్భాల్లో కృత్రిమంగా కన్నీటిని ఇచ్చే చుక్కల మందులూ, ల్యూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్, కన్ను సరిగా చూడలేక΄ోతున్న సందర్భాల్లో యాంటీ గ్లేర్ కళ్లజోడు, కన్ను పూర్తిగా అలసి΄ోతున్నప్పుడు కంటికి సంబంధించిన కొన్ని వ్యాయామాలను డాక్టర్లు చెబుతారు.
దీనికి తోడు పూర్తి దేహానికి ఒత్తిడి తొలగేందుకు యోగా, పప్రాణాయామ వంటి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలంటూ చెబుతారు. ఇక కొందరికి కౌన్సెలింగ్ అవసరమవుతుంది. దీనికి తోడు దేహానికి తగినన్ని ద్రవాలు అందుతూ దేహాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేలా నీరూ, ద్రవాహారం తీసుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, మంచి ΄ోషకాహారం తీసుకోవడం వంటి మంచి జీవనశైలి మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది.
చివరగా... ఇటీవల వైగవంతమైన జీవనశైలిలో కంటినీ, కంటి ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. మొదట్లో ఒత్తిడి (స్ట్రెస్) కారణంగా కంటికి వచ్చే అనారోగ్యాలు పెద్దగా ఇబ్బంది పెట్టక΄ోవచ్చుగానీ... ఇదే వత్తిడి దీర్ఘకాలం ఉంటూ అదేపనిగా కంటిపై ఒత్తిడి కలగజేస్తే అది మరిన్ని దుష్పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే ‘చికిత్స కంటే నివారణ మేలు’ అనే సూక్తిని అనుసరించి సమస్య చిన్నగా ఉన్నప్పుడే దానిపై దృష్టి కేంద్రీకరించి, దాన్ని పూర్తిగా తగ్గించుకోవలన్న వాస్తవం కంటి విషయంలో మరింతగా ఆచరించాల్సిన సత్యం.
కంటిపై ఒత్తిడి తగ్గి...
కన్ను ఆరోగ్యంగా ఉండాలంటే...
ప్రతి 20 నిమిషాలకొకసారి 20 అడుగుల దూరాన్ని 20 సెకన్ల పాటు చూస్తుండాలి.
ప్రతి రెండు గంటలకోసారి (కంప్యూటర్ చూడ్డంలాంటి) పనికి బ్రేకిచ్చి 10 – 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి.
రాత్రి నిద్రకు ఉపక్రమించే గంటా లేదా రెండుగంటల ముందర మొబైల్ ఆపేయాలి.
రాత్రి చీకట్లో లైట్ లేకుండా మొబైల్‌గానీ, లాప్‌టాప్‌గానీ చూడకూడదు.
ఇటీవలి జీవనశైలిలో ఒత్తిడి ఓ అనివార్యమైన విషయం. ఒత్తిడి (స్ట్రెస్) ప్రభావం దేహంలోని అనేక అవయవాల మీద ప్రతికూలంగా పడుతుందన్న సంగతి తెలిసిందే. చాలామందికి తెలియనిదేమిటంటే... ఒత్తిడి ప్రభావం కంటిపై కూడా ఉంటుందని! చాలాకాలం పాటు కంటి మీద పడే ఒత్తిడి అనేక కంటి సమస్యలను తెచ్చిపెడుతుందంటున్నారు కంటి వైద్య నిపుణులు. సుదీర్ఘకాలం పడే ఒత్తిడి కారణంగా కంటికి సంబంధించి స్వల్పమైనవి మొదలు చాలా తీవ్రమైన అనర్థాల వరకూ ఏర్పడడతాయని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం.
(చదవండి: అరటి తొక్కలతో దంతాలకు తళతళలాడే తెలుపు..! నిపుణులు మాత్రం..)