వేసవిలో వేడికి చల్లని గాలి మేనికి తగిలితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అదే గాలి ఉదృతమైతే చెట్ల కొమ్మలు ఊగడం, తలుపులు కిటికీలు టపటప కొట్టుకోవడం, తేలిక΄పాటి వస్తువులు ఎగరడం.. ఇవన్నీ చూస్తుంటాం. కానీ, ‘గాలి కంటికి కనిపించదు, ప్రపంచాన్ని మాత్రం కదిలిస్తుంది..’ అంతటి శక్తిమంతమైనది. ఇలా మన కళ్ల ముందు కనిపించే వస్తువులను చూపుతూ, కనపడని గాలిని పరిచయం చేయవచ్చు. పిల్లల వయసును బట్టి, అనేకానేక విషయాలను ఉదహరిస్తూ ‘గాలి’బలం గురించి చెప్పవచ్చు. తెలుసుకోమనవచ్చు. వారికి తెలిసింది తమ క్రియేటివిటీతో చూపమనండి.
1. కనిపించని కథ... గాలి కంటికి కనిపించదు. అయితే చెట్ల కొమ్మలు ఎందుకు ఊగుతాయి, కర్టెన్ ఎందుకు కదులుతుంది, ఉక్క΄ోస్తున్నప్పడు ఫ్యాన్ వేస్తే ఏమవుతుంది.. ఇవన్నీ చెప్పడంతోపాటు ఒక పేపర్ తీసుకుని నోటితో ఊది కదిలించమనండి. టేబుల్ ఫ్యాన్ ముందు రిబ్బన్ కట్టి ఎలా ఊగుతుందో చూపించండి. కారులో ఏసీ లేకుండా డోర్స్ అన్నీ లాక్ చేసి, కాసేపు ఉంటే ఏమవుతుందో చెప్పమనవచ్చు. ఈ విధానం వల్ల ఊపిరిని నిలిపే ్ర΄ాణవాయువును ఎన్నో రూపాలుగా కళ్ల ముందు ఆవిష్కరింపజేయవచ్చు అనే విషయం పిల్లలకు అర్ధమవుతుంది.
2. విండ్‌మిల్.. గాలి పటం... గాలి బలంగా ఉంటే విండ్‌మిల్ ఎలా తిరుగుతుందో చూపించవచ్చు. బెలూన్‌లో గాలి నింపి, బయటకు వదలమని చెప్పవచ్చు. గాలిపటం ఎందుకు ఎగురుతుంది? గాలి లేక΄ోతే ఏమవుతుంది? పక్షులు గాలిని ఎలా ఉపయోగిస్తాయి? పిల్లలతో చిన్న గాలిపటం డ్రా చేయించండి లేదా తయారు చేయించండి.
3. శుభ్రమైన గాలి... వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ గాలిని ఎందుకు కలుషితం చేస్తుంది. చెట్ల వల్ల గాలి ఎలా శుభ్రపడుతుంది? మొక్కల పెంపకం ప్రాధాన్యత, గాలి వేగం పెరిగితే ఏమవుతుంది? తుఫాన్లు ఎలా వస్తాయి, సుడిగాలులు ఎలా ఉత్పన్నమవుతాయి... గాలిపైన ఎవరెన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేయదగితే అన్నీ చేయమనండి.
4. ఊహలకు రూపం... గాలికి కోపం వస్తే.. ఊహాకథలు చెప్పమనండి. పాటలు పాడమనండి. ఒక చిన్న వ్యాసం రాయమనండి. పంచభూతాలను తమ సృజనాత్మక కోణంలో ఎలా చూపుతారో ఛాయిస్ వారికే ఇవ్వండి. ఈ విధానం వల్ల కాలుష్యకార కాలను పిల్లలు గుర్తించగలుగుతారు. పర్యావరణంలో తమ పాత్రను తెలుసుకోగలుగుతారు. సినీ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్ తల్లి గీతాభాస్కర్. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు.
కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్ టీచర్‌గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్ కోర్సులను అందిస్తున్నారు ఆమె. పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్ ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు.
(‘ఫైవ్ ఎలిమెంట్స్’పై పిల్లల చేత డ్రాయింగ్, కార్టూన్, నాటకం, పాట, కవిత్వం, రచన.. ఇలా వారి వయసును బట్టి ఎవరెవరు ఏమేం చేస్తారో చేయమనండి. ఆ వి‘చిత్రాల’ను మాకు పంపించండి. ఊరు, పేరు, ఫొటోతో సహా ప్రచురిద్దాం. మెయిల్ ఐడి sakshisummerkids@gmail.com)
నిర్వహణ: నిర్మలారెడ్డి
(చదవండి: సైబర్ మోసంతో అకౌంట్ ఫ్రీజ్ అయితే...)


