ఇటు చూడండి.. నేను కూడా మిమిక్రీ చేస్తా! | The Strange Mimicry Sounds Made By The Lyrebird | Sakshi
Sakshi News home page

ఇటు చూడండి.. నేను కూడా మిమిక్రీ చేస్తా!

May 28 2026 9:39 AM | Updated on May 28 2026 11:57 AM

The Strange Mimicry Sounds Made By The Lyrebird

లైర్‌ బర్డ్‌

మీకు మిమిక్రీ చేయడమంటే ఇష్టమే కదా ఫ్రెండ్స్‌? మరి పక్షులు కూడా మిమిక్రీ చేస్తాయంటే నమ్ముతారా? నిజం!

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన పక్షి పేరు ‘లైర్‌ బర్డ్‌’. ఇది ఆస్ట్రేలియా అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఏదైనా శబ్దాన్ని వింటే చాలు, అచ్చు గుద్దినట్టు అలాగే తిరిగి చేసి చూపిస్తుంది. ఇతర పక్షులు, జంతువుల కూతలను ఈజీగా అనుకరిస్తుంది. 

అంతేకాదు మొబైల్‌ రింగ్‌టోన్లు, కెమెరా క్లిక్‌మనిపించే శబ్దం, కార్‌ అలారాలు, చివరకు అడవిని నరికే గొడ్డలి, చైన్‌–సా  శబ్దాలను కూడా ఇది సేమ్‌ టు సేమ్‌ పలికించగలదు. కొన్నిసార్లు చిన్న పిల్లలు ఏడుస్తున్నట్టు కూడా ఇది శబ్దం చేసి అందరినీ కంగారు పెడుతుంది! అయితే ఈ అద్భుతమైన పక్షులు ఇపుడు ప్రమాదంలో ఉన్నాయి. అడవులు తగ్గి΄ోవడం, ఇతర జంతువుల వేట వల్ల వీటి సంఖ్య తగ్గుతోంది. అందుకే వీటిని కాపాడుకోవడం ఎంతో అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement