ఎంత తెలుసుకున్నా కొంత మిగిలిపోతుంది అనేలా.. ఈ పుడమిలో విషయాలెన్నో. కొన్ని మామూలుగా అనిపించినా, మరికొన్ని మాత్రం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిలో ఇవి కూడా. అవేంటో చూద్దాం!
పక్షులు మూత్ర విసర్జన చేయవు. వాటి వ్యర్థాలు ఒకే ఉమ్మడి రూపంలో బయటకు వస్తాయి.
చీమలు ఎంత ఎత్తు నుంచి పడినా బతుకగలవు. చాలా అరుదుగా మాత్రమే వాటికి గాయాలవుతాయి.
కొన్ని కప్పలు శీతాకాలంలో గడ్డకట్టుకుపోయి.. మళ్లీ వసంతకాలంలో సాధారణ స్థితికి వస్తాయి.
చేపలు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటుంటాయి. అవి పరస్పరం సంభాషించుకోవడానికి గొణుగుతున్నటువంటి శబ్దాలను ఉపయోగిస్తాయి.
సీతాకోకచిలుకలు అవి గొంగళి పురుగు దశలో ఉన్నప్పటి జ్ఞాపకాలను కూడా గుర్తుంచుకోగలవు.
మేకలకు దీర్ఘచతురస్రాకార కనుపాపలు ఉంటాయి. అవి విశాలమైన ప్రాంతాన్ని చూడటానికి, ప్రమాదాన్ని సులభంగా గుర్తించడానికీ సహాయపడతాయి.


