మంచి నిద్ర కోసం చేయాల్సినవి ఇవే... 

Simple Steps For Good Sleep - Sakshi

మంచి నిద్ర కావాలనుకునే వాళ్లు ఈ కింది సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అవి... 
►పొగతాగే అలవాటును పూర్తిగా మానేయాలి.  
►బెడ్‌రూమ్‌ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మరీ చల్లగానూ, మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి. 
►నిద్ర సమయంలో గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. 
►సాయంత్ర వేళలనుంచి కాఫీలు, టీలను, కెఫిన్‌ ఉండే కూల్‌డ్రింక్స్‌ తీసుకోకండి. 
►రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
►ప్రతిరోజూ ఒకే నిర్ణీత వేళకి నిద్రపోవాలి.
►పగటి పూట చిన్న కునుకు (పవర్‌ న్యాప్‌) మాత్రమే చాలు. ఎక్కువసేపు నిద్రపోవద్దు. 
►రాత్రి బాగా నిద్ర పట్టాలంటే రోజూు కనీసం అరగంట సేపయినా పగటి వెలుగులో గడపాలి. పగలు వుసక వెలుగు రూమ్‌లలో గడిపేవారికి రాత్రివేళల్లో సరిగా నిద్రపట్టదు. 
►గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్‌ అనే అమైనో ఆసిడ్‌ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది. 
►నిద్రకు వుుందు పుస్తకాలు చదవడం వంటివి చేయవద్దు. 
►నిద్రకు ముందు ఆల్కహాల్‌ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్‌ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. దాంతో నిద్రలేచాక రిఫ్రెషింగ్‌ ఫీలింగ్‌ ఉండదు. అందుకే వుద్యం తాగాక నిద్ర వచ్చినా మెలకువ తర్వాత అలసటంతా తీరిపోయిన రిఫ్రెషింగ్‌ ఫీలింగ్‌ ఉండదు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top