ఉమ్మడి కుటుంబాల ఊసే లేదు..! కానీ నాటి పెద్దాళ్లు.. | Nuclear vs Joint family which one is better | Sakshi
Sakshi News home page

ఉమ్మడి కుటుంబాల ఊసే లేదు..! కానీ నాటి పెద్దాళ్లు..

Jul 6 2025 2:02 PM | Updated on Jul 6 2025 2:46 PM

Nuclear vs Joint family which one is better

అవ్వ..అయ్య..అన్న..తమ్ముడు..వదిన..మరదలు..అక్క..బావ.. పిల్లలు.. ఇలా అందరూ కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబాలు పల్లెల్లో గతంలో కనిపించేవి. ఒక్క పూటకు అందరికీ భోజనాలు సరిపోవాలంటే పెద్ద గంజులో అన్నం, కూర వండి కలిసి తినేవారు. ఆ ఇళ్లలో నిత్యం పండుగ వాతావరణం కనిపించేది. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే అందరూ దగ్గర ఉండి ధైర్యం చెబుతూ వ్యాధి తగ్గే వరకు చుట్టూ తిరుగుతూ ప్రతీ క్షణం బాగోగులు చూసుకునేవారు.

కానీ నేడు భార్య, భర్త, పిల్లలు చాలు అంటున్న కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఎలక్ట్రిక్‌ కుక్కర్‌లో అన్నం.. ప్రెషర్‌ కుక్కర్‌లో కూరలు వండుకొని ఎవరికీ తీరినప్పుడు వారు తినేసి ఉద్యోగం, ఉపాధిబాట పడుతున్నారు. జ్వరమొచ్చినా.. జలుబు వచ్చినా పరామర్శించే వారు కరువవుతున్నారు. మనోధైర్యం చెప్పేవారు కనిపించడం లేదు. ఫలితంగా చిన్నపాటి సమస్యలకే ఇంట్లో గొడవలు పెట్టుకోవడం.. అవి కాస్త తీవ్రమైతే ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. 

పెనవేసుకునే ఉమ్మడి బంధం
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు భార్యభర్తల మధ్య పొరపచ్చాలు వస్తే పెద్దలు సర్ది చెప్పేవారు. దీంతో సమస్య అక్కడికక్కడే పరిష్కారమయ్యేది. కానీ నేడు హితబోధ చేసే పెద్దలు దగ్గర ఉండకపోవడంతో దంపతుల మధ్య చిన్నపాటి గొడవలకే మనస్పర్థలకు పోతూ విడిపోవాలనే ఆలోచన లేదంటే లోకం నుంచే వెళ్లిపోవాలనే దురాలోచనతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. 

ఈ పరిస్థితుల్లోనే బంధాలు.. అనుబంధాలు బలహీనమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు సీనియర్‌ సిటిజెన్స్‌ తాము గడిపిన ఉమ్మడి కుటుంబాల నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఇప్పటి పరిస్థితులను చూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడే బాగుండేది
మేము ఇద్దరం, మా పిల్లలు న లుగురు.. వారి పిల్లలతో కలిసి ఉండేవాళ్లం. మా మనుమలు, మనుమరాండ్లు పెద్దగా అ య్యే వరకు కలిసి ఉన్నాం. ఆ కాలంలో అందరం ఒకే ఇంట్లో ఆనందంగా ఉండేవాళ్లం. రాత్రి పూట క లిసి భోజనం చేసేవాళ్లం. ఇంట్లో ఎవరికీ కష్టం వచ్చి నా పెద్దమనిషి ముందు ఉండి నడిపించేవారు. రా త్రయితే ఇంటి ముందర మా గల్లీలో ఉన్న వాళ్లంతా చేరి మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అందరూ టీవీ లు చూస్తూ ఇళ్లలోనే ఉంటున్నారు. పక్కింటి వారిని కూడా మాట్లాడించే పరిస్థితులు లేవు. ఆ రోజులే బాగుండేవి.    
– నిమ్మ మల్లమ్మ, నారాయణపూర్‌

కలిసిమెలిసి ఉండేవాళ్లం
మేము ఐదుగురం అన్నదమ్ములం. అందరం ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్లం. మా అందరికీ పెళ్లిళ్లు అయి, పిల్లలు కలిగే వరకు కూడా మా పెద్ద ఇంట్లోనే కలిసి ఉన్నాం. రాత్రయితే అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. భోజనం సమయంలో మా ఇంట్లో రోజూ పండుగ వాతావరణం కనిపించేది. ఉద్యోగం, ఉపాధి, పిల్లలు చదువుల దృష్ట్యా ఇతర ప్రాంతాలకు వెళ్లడం.. ఒకే ఊరిలో ఉన్న విడివిడిగా ఉండిపోతున్నాం. అప్పటి రోజులు ప్రేమానురాగాలతో బాగుండేవి.
– లద్దునూరి తిరుపతి, నారాయణపూర్‌

ఎవరి పనిలో వారు బిజీ
ఎనుకటి రోజులే బాగుండేవి. ఇద్దరు కొడుకులు, ఒక కూతురుతో కలిసి ఉన్న జ్ఞాపకాలను మర్చిపోలేం. ఉమ్మడి కుటుంబానికి మించిన ఆనందం మరొకటి లేదు. పండుగ వచ్చిందంటే అందరం ఒక చోట చేరితే ఇల్లంతా సందడిగా ఉండేది. కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు.. వారి పిల్లలతో రోజులు గడిచిపోయేది. ఇప్పుడు ఎవరికి వారు వేరుగా ఉండడంతో రోజుల తరబడి కలుసుకోవడం లేదు. అప్పటి రోజులు మళ్లీ వస్తే బాగుండు అనిపిస్తుంది. 
ముంజ ఎల్లయ్య, ఇల్లంతకుంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement