
ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అన్నా చెల్లెలు చివరకు ఒకే పాఠశాలలో పోస్టింగ్ పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలోని ఆత్మకూరుకు చెందిన బాలస్వామి (హెచ్‌ఎం), నాగమణి దంపతుల కుమారుడు, శ్యామూల్ రాజు, కుమార్తె సారాపింకి కొత్తగా ఉపాధ్యా య ఉద్యోగాలు పొందారు. ఒకేసారి ఉద్యోగా లు పొందడమే కాకుండా ఒకే పాఠశాలలో టీచర్లుగా చేరడం విశేషం.
మండలంలోని హు సేనాపురం ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయులుగా మంగళవారం విధుల్లో చేరారు. వీరి సోదరి మౌనిక కూడా అమలాపురంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నట్లు శ్యామ్యూల్ రాజు, సారాపింకి తెలిపారు. ఒకే పాఠశాలలో ఇద్దరం విధుల్లో చేరడం ఆనందంగా ఉందని, విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు.
(చదవండి: ఆ కారణంతోనే ఐశ్వర్యని వెనక్కినెట్టి.. సుస్మితా మిస్ ఇండియాగా గెలుపొందింది..!)