ఆలయంలో దాగిన మహానిధి.. తాకితే సర్వనాశనమేనా? | Kollur Mookambika Temple, The Mystery Of The Hidden Treasure And The Serpent Seal, Watch Video For Interesting Details | Sakshi
Sakshi News home page

ఆలయంలో దాగిన మహానిధి.. తాకితే సర్వనాశనమేనా?

Jul 8 2026 9:52 PM | Updated on Jul 9 2026 10:26 AM

Mystery of Kollur Mookambika Temple

నిధి.. అనంతమైన సంపద.. కొన్ని శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న రహస్యం! భారతదేశంలో నిధులు అనగానే మనకు కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడ నాగబంధం ఉన్న ఓ గది తలుపులను ఇప్పటికీ తెరవలేదు. అయితే.. అంతకంటే మర్మంగా ఉన్న ఓ ఆలయం మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఉందనే విషయం మీకు తెలుసా? కర్ణాటకలో.. దట్టమైన పశ్చిమ కనుమల నడుమ.. ఉడుపి జిల్లా కొల్లూరులో కొలువుదీరిన మూకాంబిక అమ్మవారి ఆలయ గర్భంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే నిధులు ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు. అయితే.. టెక్నాలజీతో ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చుకున్న ఈ రోజుల్లో కూడా.. సైన్స్ సమాధానం చెప్పలేకపోతున్న ఓ మిస్టరీ ఆ ఆలయం..! మూకాంబికా ఆలయంలో నిధుల గురించి చూద్దాం..

ఎన్ని శతాబ్దాలు గడిచినా.. ఎంతగా అధునాతన టెక్నాలజీ వచ్చినా.. కొల్లూరు మూకాంబిక ఆలయ సర్ప ముద్ర వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ వీడలేదు. ఆ పాము ఆకారం కింద నిజంగానే వేల కోట్ల రూపాయలు విలువ చేసే నిధి ఉందా? దాన్ని ఇప్పటికీ ఆ దైవిక సర్పం కాపాడుతోందా? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో చూడండి.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement