ముంబై స్లమ్‌ నుంచి అంతర్జాతీయ కెరీర్‌ రేంజ్‌కు..! | Mumbai slum and Rs 5,000 job to working in Germany Goes Viral | Sakshi
Sakshi News home page

ముంబై స్లమ్‌ నుంచి అంతర్జాతీయ కెరీర్‌ రేంజ్‌కు..! వైరల్‌గా టెకీ స్టోరీ

Jun 2 2026 3:24 PM | Updated on Jun 2 2026 3:27 PM

Mumbai slum and Rs 5,000 job to working in Germany Goes Viral

చాలా సక్సెస్‌ స్టోరీలు మన కళ్ల ముందు..నుంచే వస్తుంటాయి. అప్పటి వరకు ఊహించం ఆ వ్యక్తి ఆ స్థాయి చేరుకుంటాడని. చాలా దయనీయ పరిస్థితిల్లో బతికి మనం చూస్తుండగానే ఆకాశమంత స్థాయికి ఎదిగి సక్సెస్‌ని ఒడిసిపట్టి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కథే ఈ టెకీ గాథ.

ముంబైలో జన్మించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంతోష్ యాదవ్‌ దాదాపు దాదాపు మూడు దశాబ్దాల పాటు మురికివాడలోనే నివశించాడు. అక్కడే అతడి చదువు, బాల్యం సాగింది. ఆ స్థాయి నుంచి జర్మనీలో కోడ్‌రాబిట్‌లో ప్రిన్సిపల్ డెవలపర్ అడ్వకేట్‌ స్థాయికి ఎలా చేరుకున్నాడో సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకున్నాడు. ఆయన భార్యతో కలిసి ఉన్న సోషల్‌ మీడియా పోస్ట్‌ని షేర్‌ చేస్తూ..తన కథను పంచుకున్నారు. 

సంతోష్‌ యాదవ్‌ ప్రస్తుతం యాంగులర్ గూగుల్ డెవలపర్ ఎక్స్‌పర్ట్ (GDE), గిట్‌హబ్ స్టార్, ఓపెన్-సోర్స్ కంట్రిబ్యూటర్, అంతర్జాతీయ స్పీకర్‌గా పేరు తెచ్చుకున్నారు. తనకు గుర్తున్నంత వరకు తన జీవితంలో ఎక్కువ భాగం ముంబై మురికివాడలోనే పెరిగానని చెప్పుకొచ్చారు. పాఠశాల చదువులో చాలా ఇ‍బ్బందిపడ్డానని అన్నారు. క్రికెట్‌ అంటే మహాఇష్టం అందువల్లే చదువులో అంతమాత్రంగా ఉండేవాడినని అన్నారు. ఆ కారణంగానే ఇంటర్‌లో సైన్సు కోరులో చేరలేకపోయానని అన్నారు. అయితే తండ్రి స్నేహితుల్లో ఒకరు యాదృచ్ఛికంగా ఇచ్చిన సలహా వల్ల కంప్యూటర్‌ డిప్లోమా కోర్సులో చేరినట్లు తెలిపారు. అయితే ఇంగ్లీష్‌ తన మాతృభాష కాకపోవడంతో పాఠాలతో పడ్డ ఇబ్బందులు అంత ఇంత కాదన్నారు. 

 

తన యాస కారణంగా తాను ఎలా ఎగతాళికి గురయ్యానో కూడా చెప్పారు. ఇక చదవలేను అని ఏడ్డిన సంగతి కూడా ఇంకా గుర్తు ఉందన్నారు. మళ్లీ యథావిధిగా పెయిల్‌ అవుతానేమోనని తెగ భయపడేవాడినని అన్నారు. బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో క్రికెట్‌ కూడా ఆడటం మానేసి, స్నేహితులకు దూరమై పూర్తిగా చదువుపైనే ఫోకస్‌ పెట్టానన్నారు. దాంతో తన గ్రేడ్‌లు మెరుగుపడటమే గాక సుమారు 60%కు పైగా మార్కులతో డిప్లోమాను పూర్తి చేశానని అన్నారు. అప్పుడు తెలిసిందే సాధించాలని గట్టిగా అనుకుంటే ఎలాగైనా.. సాధించగలరు, చేయగలరని, కేవంల పట్టుదలను వదులుకోకూడదని అన్నారు. 

తన క్లాస్‌మేట్‌ తన యాసను ఎగతాళి చేయడంతోనే సవాలుగా తీసుకుని తనను తాను మెరుగుపరుచుకున్నట్లు తెలిపారు. అయితే ఆకస్మికంగా తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందులు చుట్టిముట్టాయన్నారు. ముంబై విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ  చదువుదామంలే కాలేజ్‌ ఫీజు చెల్లించలేని పరిస్థితి దాంతో ఉద్యోగం వెతుక్కోమని ఇంట్లో వాళ్లు కరాఖండీగా చెప్పారని తెలిపారు. దాంతో రాత్రంతా ఏడుస్తూ ఉన్న నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. అయితే తన పరిస్థితిని చూసిన తల్లి తండ్రితో మాట్లాడి చదువుకు కొనసాగించేలా చేసిందన్నారు. 

తన మేనమామ సాయంతోనే చదువు కొనసాగించగలిగానని అన్నారు. సరిగ్గా కంప్యూటర్‌ సైన్సుతో డిగ్రీ పూర్తి చేసేనాటికి 2008 ఆర్థిక సంక్షోభం సంభవించి ఉద్యోగాలు దొరకడమే కష్టమైంది. దాంతో ఎంతో కష్టపడి నెలకు రూ. 5000 జీతంతో ఒక ఉద్యోగాన్ని సంపాదించానని నఅ‍్నారు. కోడింగ్‌ అంటే ఇష్టంతో C#లో మంచి పట్టు సాధించానన్నారు. నిరంతరం కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటూ నైపుణ్యాభివృద్ధిని సంపాదించుకుని 2010 కల్లా నెలకు రూ. 12 వేల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని సంపాదించానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆగస్టులో 2011లో ఒక స్టార్టప్‌లో చేరి ఐదేళ్లపాటు అక్కడే పనిచేశానని అన్నారు. జీతం బాగుండేది, పైగా తాను చేరినప్పుడు  50% కంటే ఎక్కువ జీతం పెరిగిందన్నారు. 

అలా చివరకు కంపెనీ ద్వారా  ఇన్సూరెన్స్, పీఎఫ్‌ కూడా లభించాయన్నారు. అలా సరిగ్గా 2016లో భార్యతో కలిసి పూణేకు మారారు. అక్కడ బహుళజాతి కంపెనీలలో పనిచేస్తూ..టెక్నికల్ బ్లాగులు రాయడం, శిక్షణా తరగతులు నిర్వహించడం, డెవలపర్‌ కమ్యూనిటీకి తన వంతు సహకారం అందించడం ప్రారంభించానని అన్నారు. అయితే పనికోసం కుటుంబ జీవితాన్ని అస్సలు త్యాగం చేయొద్దని అన్నారు. ఎందుకంటే ఎనిమిది గంటల కంటే ఎక్కువ పనిచేసినా అదనంగా వేతనం మాత్రం లభించదన్నారు. తన కెరీర్‌ 2019లో అనూహ్యమైన మలుపు తిరిగిందన్నారు. 

ఆ సమయంలో యాదవ్ Angular, NgRx వంటి ఓపెన్-సోర్స్ ప్రాజెక్టులకు తన వంతు సహకారం అందించడం ప్రారంభించారు. అలా అనతి కాలంలోనే కమ్యూనిటీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అదే ఏడాది తన తొలి కాన్ఫెరెన్స్‌ ప్రసంగం ఇచ్చాడు. ఆ తర్వాత గూగుల్ డెవలపర్ ఎక్స్‌పర్ట్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం అందింది. అలాగే నవంబర్ 13, 2019న తన పుట్టి రోజున యాంగులర్‌ కోసం  గూగుల్ డెవలపర్ ఎక్స్‌పర్ట్‌గా అధికారికంగా ప్రకటించబడ్డారు. 

ఆ తర్వాత 2020లో తన తోటి డెవలపర్లు నామినేట్‌ చేయడంతో భారతదేశపు తొలి గిట్‌హబ్ స్టార్ అయ్యాడు. అతని లింక్డ్‌ ఇన్‌ ప్రొఫెల్‌ ప్రకారం..జనవరి 2026లో జర్మనీలోని కోడ్‌రాబిట్‌లో ప్రిన్సిపల్ డెవలపర్ అడ్వకేట్‌గా మారడానికి ముందు, అవోడాక్ ఏజీ సెలొనిస్‌ వంటి కంపెనీలతో పనిచేశారు. తన కెరీర్‌లో 17 ఏళ్లకు పైగా గడిచినా..యాదవ్ ఓపెన్-సోర్స్ సాఫ్ట్‌వేర్‌లో ఇప్పటికీ చురుకుగా ఉన్నారు. 50కి పైగా అంతర్జాతీయ ప్రసంగాలు ఇచ్చారు, ప్రపంచవ్యాప్తంగా డెవలపర్‌లకు మార్గదర్శకత్వం వహిస్తూనే ఉన్నారు.

 

(చదవండి: రాళ్లతో ధ్యాన సాధన..! కళకారుడి అద్భుత టెక్నిక్‌..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement