
హీరో అల్లు అర్జున్‌తో అంబికా నాయక్(PC: Instagram)
Mumbai DJ Model Ambika Nayak: ముంబైకి చెందిన కయన్ డిజే, మోడల్, రైటర్, సింగర్. తల్లి దగ్గర గాత్రసంగీతాన్ని అభ్యసించింది. హిప్–హప్, గెట్టో టెక్, ఆర్ అండ్ బీ...ఇలా రకరకాల మ్యూజిక్ జానర్స్ అంటే ఇష్టం. సీబీ హోయో, జెమిమా కిర్కే. జోర్జా స్మీత్, బ్రెంట్ ఫయాజ్... మొదలైనవారి నుంచి ఇన్‌స్పైర్ అయింది. ‘కూల్‌కిడ్స్’ పాటతో బాగా పేరు తెచ్చుకుంది కయన్. ‘ఏదో రాసి, పాడేసి మార్కెట్టులో వదిలాను’ అనుకునే ధోరణి ఎప్పుడూ విజయవంతం కాదు అని నమ్ముతుంది కయన్.
అందుకే తన పాట మార్కెట్ ను తాకే ముందు ఎప్పటికప్పుడు మరింత బెటర్‌మెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. రచనకు అవసరమైన ముడిసరుకును తన అనుభవాల్లో నుంచి తీసుకొని రాస్తుంది. అందుకే ఆ పాటలు సహజంగా ఉంటాయి. పనిలో నుంచి సంగీతం పుట్టింది కదా! అందుకే పాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో పనికీ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడైనా ఒత్తిడికి గురైనప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తుంది. నడుము వంచి ఇల్లంతా క్లీన్ చేస్తుంది.
‘ఖాళీ సమయంలో ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు కాస్త వెరైటీగా ఇలా సమాధానం చెప్పింది.... ‘ఖాళీ సమయంలో కూడా ఏదో ఒక పని చేస్తూ ఎంజాయ్ చేస్తాను’. అదిసరే, ‘కయన్’ అనే పేరు కాస్త వెరైటీగా ఉందేమిటీ? అనుకుంటున్నారా! ఏమీలేదండీ...ఆమె అసలు పేరు అంబికా నాయక్. సర్‌నేమ్ ‘నాయక్’ను తిరగేసి కయన్ అయింది. అంతే!!
చదవండి: Rewind 2021: సామాన్యురాలు ఫోర్బ్స్' లిస్టులో.. విశ్వకిరీటం మరోసారి