ఆ ఫ్యాన్సీ మొబైల్‌ నెంబర్‌ సిమ్‌ వేలంలో..ఏకంగా అన్ని కోట్లా..! | Sakshi
Sakshi News home page

ఆ ఫ్యాన్సీ మొబైల్‌ నెంబర్‌ సిమ్‌ వేలంలో..ఏకంగా అన్ని కోట్లా..!

Published Mon, Apr 8 2024 11:35 AM

This Mobile Number Fetched Whopping Rs 7 Crore At Dubai Auction - Sakshi

ప్రత్యేక సీరిస్‌తో కూడిన నెంబర్‌లతో కూడిన ఫోన్‌ నెంబర్‌లకు, నంబర్‌ ప్లేట్‌లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ఆ నెంబర్‌ సీరీస్‌తో కూడిన ఫోన్‌లు, కార్లు సొంతం చేసుకునేందుకు జనాలు ఎగబడుతుంటారు. ఎంత డభైనా ఖర్చుపెడతారు. అలానే ఓ ప్రత్యేక సిరీస్‌తో కూడిన మొబైల్‌ సిమ్‌ని వేలం వేయగా ఎన్ని కోట్లు పలికిందో వింటే కంగుతింటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే..ఆ ఫ్యాన్సీ నెంబర్‌ సిరీస్‌కి తగ్గట్టుగా ధరకు అమ్ముడుపోతే ఇది కలా నిజమా అనిపిస్తుంది. అలాంటి సన్నివేశమే ఇక్కడ చోటుచేసుకుంది. 

ఇది ఎక్కడ జరిగిందంటే..?దుబాయ్‌ ఛారిటీ వేలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ది మోస్ట్‌ నోబుల్‌ నంబర్స్‌ ఏడు సిరీస్‌తో ఉన్న ఉన్న సిమ్‌ 058-7777777 వేలంలో ఏకంగా ఏడు కోట్లకు అమ్ముడుపోయింది. ఆ సిమ్‌ నెంబర్‌ సంఖ్యలోనే ధర కూడా అనూహ్యంగా పలకడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటి వేలాన్ని యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రధాన మంత్రి, దుబాయ్‌ పాలకుడు అయిన షేక్‌ మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ ముక్తూమ్‌ ప్రారంభించారు. దీన్ని దాదాపు రూ. 100 కోట్ల మదర్స్‌ ఎండోమెంట్‌ ప్రచారానికి మద్దుతుగా ఇలా పది నెంబర్‌ల ఫ్యాన్సీ కార్ల నెంబర్‌ ప్లేట్లు, 21 ప్రత్యేకమైన మొబైల్‌ నెంబర్‌లను వేలం వేస్తున్నారు.

అయితే ఇంతవరకు వేలంలో చాలా నెంబర్లు కోట్లలో అమ్ముడుపోయినా.. ఈ 7 నెంబర్‌ సిరీస్‌తో ఉన్న సిమ్‌పై మాత్రం తీవ్ర ఉత్కంఠ పోటీ తలెత్తింది. ప్రారంభంలోనే రూ. 22 లక్షల నుంచి మొదలై ఏకంగా చివరి రూ. 7 కోట్లకు అమ్ముడు పోడం విశేషం. అలాగే ఈ 5 సీరిస్‌(054-5555555) సిమ్‌పై కూడా తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ సీరిస్‌ కూడా వేలంలో ఏకంగా రూ. 23 కోట్ల వరకు పలకడం విశేషం. మొత్తం ఈ ఫ్యాన్సీ నెంబర్‌లతో కూడిన మొబైల్‌ నెంబర్లు వేలంలో దాదాపు రూ. 86 కోట్లు దాకా వసూలు చేశాయి.

అలాగే ఫ్యాన్సీ నెంబర్‌ ప్లేట్లు కూడా ఈ వేలంలో రూ 65 కోట్లు దాక పలికాయి. గతేడాది కూడా ఇలా ఫ్యాన్సీ సిరీస్‌తో కూడిన నెంబర్‌ ప్లేట్లు ఏకంగా రూ. 124 కోట్లు పలికి దుబాయ్‌​ పేరు వార్తల్లో నిలిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం సంపద బాగా ఉన్నవాళ్లే ఇలాంటి పనులకు పూనుకుంటారు. ఇదొక పిచ్చి, డబ్బు దుర్వినియోగం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.  

(చదవండి: ఇసుక లేకుండానే ఇల్లు కట్టేయొచ్చట! ఎలాగో తెలుసా..!)

Advertisement
 
Advertisement
 
Advertisement