క్వీన్‌ ఆఫ్‌ నట్స్‌ .. షుగర్, కేన్సర్‌ రానివ్వవు.. | Macadamia Nuts Exotic Queen of Nuts | Sakshi
Sakshi News home page

క్వీన్‌ ఆఫ్‌ నట్స్‌ .. షుగర్, కేన్సర్‌ రానివ్వవు..

Sep 18 2024 11:09 AM | Updated on Sep 18 2024 1:01 PM

Macadamia Nuts Exotic Queen of Nuts

అత్యంత ఖరీదైన గింజ పంట

ఎక్కువగా ఆస్ట్రేలియా తదితర దేశాల్లో సాగవుతోంది.. 

మన దేశంలో ఈమధ్యనే సాగు ప్రారంభమైంది..  

సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే మకడమియ తోటల సాగు మనకు బాగా కొత్త.   ప్రోటీసీ కుటుంబం. ఎన్నో పోషక విలువలతో కూడినది కావటం వల్ల దీనికి క్వీన్‌ ఆఫ్‌ ద నట్స్‌ అని పేరొచ్చింది. మకడమియ చెట్టు గింజలను క్వీన్స్‌లాండ్‌ నట్స్‌ లేదా ఆస్ట్రేలియన్‌ నట్స్‌ అని కూడా పిలుస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ఉష్ణమండల ప్రాంతాలు దీని సాగుకు అనుకూలం. గుండె జబ్బులు, కేన్సర్, షుగర్‌ రానివ్వకుండా చూసే ఈ అద్భుత పంటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మకడమియ దీర్ఘకాలిక పంట. గుబురుగా పెరిగే చెట్టుకు కాచే గుండ్రటి మకడమియ కాయల నుంచి వొలిచిన గింజలను తింటారు. ఈ గింజలు చూడడానికి పెద్ద శనగల మాదిరిగా ఉంటాయి. గుండ్రటి కాయలోని మరొక ΄÷రలో ఈ గింజ దాక్కొని ఉంటుంది. మకడమియ చెట్లలో ఏడు జాతులున్నాయి. వాణిజ్యపరంగా సాగుకు అనువైనవి రెండు మాత్రమే. మకడమియ ఇంటెగ్రిఫోలియ (దీని కాయ పెంకు గుల్లగా ఉంటుంది), మకడమియ టెట్రాఫిల్లా (దీని కాయ పెంకు కొంచెం గట్టిగా ఉంటుంది). మిగతా రకాల గింజలు విషపూరితాలు, తినటానికి పనికిరావు.

కిలో గింజల ధర రూ. 1,175
మకడమియ పంట ఆస్ట్రేలియా, హవాయి, సౌతాఫ్రికా, మలావి, బ్రెజిల్, ఫిజి, కాలిఫోర్నియ (అమెరికా)లో ఎక్కువగా సాగువుతున్నది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో కొందరు రైతులు ఈ చెట్ల సాగును ఈ మధ్యనే ప్రారంభించారు. 2017 నాటి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 48,544 టన్నుల మకడమియ కాయల వార్షిక ఉత్పత్తి జరుగుతోంది. ప్రధానంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెన్యాల నుంచే 70% దిగుబడి వస్తోంది. డిమాండ్‌కు తగిన మకడమియ గింజల లభ్యత మార్కెట్‌లో లేదు. ఈ గింజల ఖరీదు కిలోకు 14 అమెరికన్‌ డాలర్లు. అంటే.. రూ. 1,175. ఇంత ఖరీదైన పంట కాబట్టే మకడమియ తోటల సాగుపై మన దేశంలోనూ రైతులు ఆసక్తి చూపుతున్నారు.

12 అడుగుల ఎత్తు
మకడమియ ఉష్ణమండల పంట. అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉంటుంది. అశోకా చెట్ల ఆకుల మాదిరిగా దీని ఆకులు ఉంటాయి. ఎత్తు 2–12 మీటర్లు, కొమ్మలు 5–10 మీటర్ల వరకు పెరగుతాయి. తెల్లటి పూలు గుత్తులుగా (8–10 సెం.మీ. పోడవున) వస్తాయి. శీతాకాలం మధ్యలో పూత ్ర΄ారంభమవుతుంది. గుత్తికి 100కిపైగా పూలు ఉన్నా 2 నుంచి 10 కాయలు మాత్రమే వస్తాయి. స్వపరాగ సంపర్కం జరిగే పంట ఇది. కృత్రిమంగా పోలినేషన్‌ చేస్తే దిగుబడి పెరుగుతుంది. 

మకడమియ కాయ పైన ఉండే మందపాటి  తీసేస్తే గట్టి గుళ్లు బయటపడతాయి. వాటిని పగులగొడితే మధ్యలో గింజలు ఉంటాయి. లేత పసుపు రంగులో మెత్తగా ఉండే గింజలు తియ్యగా ఉంటాయి. పూత వచ్చిన 7–8 నెలల్లో కాయలు కోతకొస్తాయి. 13 –31 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత దీనికి సూటబుల్‌. వార్షిక వర్ష΄ాతం 125 సెం.మీ. చాలు. నీరు నిలవని సారవంతమైన లోమీ సాయిల్‌ (ఇసుక, బంకమన్ను, సేంద్రియ పదార్థం కలిసిన ఎర్ర ఒండ్రు భూములు) అనుకూలం. విత్తనాల ద్వారా, కొమ్మ కత్తిరింపుల ద్వారా మొక్కలు పెంచవచ్చు. నాటిన తర్వాత 4–5 ఏళ్లలో కాపు ప్రారంభమై.. 50–75 ఏళ్ల ΄ాటు కాయల దిగుబడినివ్వటం ఈ చెట్ల ప్రత్యేకత.

ఆరోగ్యదాయక పోషకాల గనిఆరోగ్యదాయకమైన అనేక పోషకాలతో కూడి ఉండే మకడమియ గింజలు తియ్యగా, కమ్మని రుచిని కలిగి ఉంటాయి. మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫాటీ ఆసిడ్లు ఉంటాయి. ఆస్ట్రేలియాలో జరిగిన పరిశోధనల ప్రకారం.. ఈ గింజలు తిన్న వారి రక్తంలో టోటల్, ఎల్‌డిఎల్‌ కొలస్ట్రాల్‌ తగ్గింది. వంద గ్రాముల గింజలు 718 కేలరీల శక్తినిస్తాయి. గింజలకే కాదు దాని పైన  రలో కూడా అధిక కేలరీలను ఇచ్చే శక్తి ఉంది. 

ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఇందులో ఉన్నాయి. వంద గ్రాముల మకడమియ గింజల్లో 8.6 గ్రాములు లేదా రోజుకు మనిషికి కావాల్సిన 23% డైటరీ ఫైబర్‌ ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ లేదు. బి–సిటోస్టెరాల్‌ వంటి ఫైటోస్టెరాల్స్‌ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఓలిక్‌ ఆసిడ్‌ (18:1), పాల్మిటోలీక్‌ ఆసిడ్‌ (16:1) వంటి మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫాటీ ఆసిడ్స్‌ పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీసు, జింగ్, సెలీనియం (గుండె రక్షణకు ఇది ముఖ్యం) వంటి ఎంతో ఉపయోగకరమైన మినరల్స్‌ ఉన్నాయి. 

ఇంకా.. జీవక్రియలకు దోహదపడే బి–కాంప్లెక్స్‌ విటమిన్లు కూడా ఉన్నాయి. వంద గ్రాముల మకడమియ గింజల్లో 15% నియాసిన్, 21% పైరిడాక్సిన్‌ (విటమిన్‌ బి–6), 100% థయామిన్, 12% రిబోఫ్లావిన్‌ వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉన్నాయి. ఆక్సిజన్‌–ఫ్రీ రాడికల్స్‌ కలిగించే నష్టం నుంచి డిఎన్‌ఎను, కణజాలాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు మకడమియ గింజల్లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ పంటకు అంత క్రేజ్‌!

గుండె ఆరోగ్యానికి మేలు..షుగర్, కేన్సర్‌ రానివ్వవు..
👉మకడమియ గింజలు గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి. 
👉 మెటబాలిక్‌ సిండ్రోమ్‌ రిస్క్‌ తగ్గిస్తాయి. 
👉 ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ∙జీర్ణ శక్తిని పెంచుతాయి. 
👉 కేన్సర్‌ నిరోధక శక్తినిస్తాయి.
👉 మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. 
👉 చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తాయి. 
👉 ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
👉 మానసిక వత్తిడి నుంచి ఇన్‌ఫ్లమేషన్‌ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 
👉 రక్తహీనత రాకుండా చూస్తాయి. 
👉 మధుమేహం రాకుండా చూస్తాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement